Kerala Congress MLA to marry IAS officer సబ్ కలెక్టర్ తో ప్రేమలో పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Mla sabarinadhan to marry sub collector divya iyer

KS Sabarinadhan, Divya Iyer, wedding, Sabarinadhan Divya Iyer wedding, Aruvikkara MLA, MLA sub-collector wedding, MLA sub-collector love, MLA sub-collector marriage, MLA sub-collector love story, G Karthikeyan, Sabarinadhan Divya Iyer photos

Aruvikkara MLA KS Sabarinadhan has announced that he is all set to marry Thiruvananthapuram sub-collector Divya Iyer, marking a rare union of politics and bureaucracy in Kerala.

ట్రెండింగ్ న్యూస్: సబ్ కలెక్టర్ ప్రేమలో పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Posted: 05/03/2017 11:42 AM IST
Mla sabarinadhan to marry sub collector divya iyer

కేర‌ళ‌లో ఓ ఐఏఎస్ అధికారిని చూసి చూడగానే ప్రేమలో పడ్డాడు ఓ ఎమ్మెల్యే. అయితే అమె అలోచన విధానాలు, వ్యవహారిక ధోరణి కూడా ఎలా వుంటుందన్న విషయంలో అమెతో సన్నిహితంగా మెలగి తెలుసుకున్నాడు. ఇక తన వైపు నుంచి అంతతా ఓకే అనుకున్న ఎమ్మెల్యే.. అలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందన్న భావనలో ఏకంగా అమె ఎదుట తన ప్రేమ  ప్రపోసల్ పెట్టాడు. అమె కూడా అందుకు సానుకూలంగానే సమ్మతి తెలపడంతో.. ఇరువురి కుటుంబసభ్యుల అనుమతి కూడా పొందారు. ఇంకేముందు మిగిలింది మంగళవాయిద్యాలు మ్రోగడం మాత్రమే.

అవునండీ ఇప్పుడు టాపిక్ కేరళ సహా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేరళలోని అరువిక్క‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్, తాను త్వరలోనే ఇంటివాడ్ని కాబోతున్నట్లు.. అందులోనూ తిరువ‌నంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య నాయ‌ర్ ను పరిణయం అడబోతున్నట్లు తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే ఒకటికాబోతున్నారన్న వార్త అధదికారికంగా దృవీకరించినట్లు అయ్యింది. అంతటితో అగని శబరినాథన్ తామిద్దరూ క‌లిసి ఉన్న ఫోటోను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన ప్రేమ గురించి ఆయన వివరించారు.

తిరువ‌నంత‌పురంలో మొద‌టిసారి దివ్య‌ను క‌లిశాన‌ని, అమె ముక్కుసూటితనం, నేర్పరితనం చూసి అమెను ఇష్టపడ్డానని, అయితే అమెతో పలు దఫాలుగా కలిసిన తరువాత త‌మ ఇద్ద‌రి ఆలోచ‌న‌లు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు తెలుసుకున్నానని పేర్కోన్నారు. ఇక అదే సమయంలో తన మ‌న‌సులో మాట‌ను దివ్య‌తో చెప్పాన‌ని ఎమ్మెల్యే చెప్పారు. అమె కూడా తన ప్రేమకు పచ్చజెండా ఊపడంతో తమ ప్రేమ వికసించిందని తెలిపారు. అంతేకాకుండా తమ వివాహానికి ఇరువురి కుటుంబాలు కూడా గ్రీస్ సిగ్నల్ ఇచ్చాయని అయన తెలిపారు.

ఇక త్వరలోనే స‌బ్ క‌లెక్ట‌ర్ ను వివాహమాడనున్నానని శభరినాథన్ చెప్పారు. కేరళ మాజీ స్పీకర్ కుమారుడైన శబరినాథన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్... తండ్రి మ‌రణానంత‌రం రాజకీయాల్లోకి వ‌చ్చారు. తిరువ‌నంత‌పురంలోని అరువిక్క‌ర నియోక‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరపున 2015లో పోటీ చేసి గెలిచారు. స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య...2016 ఎన్నిక‌ల సంద‌ర్భంగా విధుల్లో భాగంగా ఒక ప్రచార వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో పాటను రాసి, ఆలపించింది కూడా ఆమె కావడంతో...ఆ వీడియో కేర‌ళలో దివ్య అయ్య‌ర్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress mla  sub collector  sabarinadhan  divya iyer  Thiruvananthapuram  facebook  trendinng news  kerala  

Other Articles