Pawan Kalyan visits Andhrajyothi Office

Pawan visits andhrajyothi office

Pawan Kalyan, Pawan kalyan Andhra Jyothi, Pawan Kalyan Andhrajyothi, KCR Pawan Andhra Jyothi Office, Andhra Jyothi Office Fire Accident, Andhra Jyothi Pawan, Chandrababu Andhra Jyothi Fire Accident, KCR Andhra Jyothi Office

Actor, Janasena Chief Pawan Kalyan visits Andhra Jyothi Office after Fire Accident. This is proved how Pawan is going to be media friendly.

కేసీఆర్ తర్వాత పవనే.. మరి చంద్రబాబు?

Posted: 05/03/2017 11:05 AM IST
Pawan visits andhrajyothi office

కొన్ని విషయాల్లో అత్యంత వేగంగా రియాక్ట్ అయ్యే నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని పేరుంది. తనకు నచ్చితే ఎక్కడికైనా వెళ్లే పవన్.. నచ్చని వారి విషయంలో ఎంత ముఖ్యమైన కార్యక్రమమైనా అస్సలు హాజరు కారన్న వాదనను వినిపిస్తుంటారు. జస్ట్ ఇగ్నోర్ అన్న చందాన ఉంటుంది పవన్ వైఖరి.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ లోని ఆంధ్రజ్యోతి పేపర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. గత శనివారం కార్యాలయం లో పై ఫ్లోర్ అగ్నిప్రమాదానికి గురై.. పూర్తిగా దగ్థమైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగటం పేపర్లు ఎక్కవగా ఉండటంతో వెనువెంటనే రెండు అంతస్తుల్లోకి మంటలు వేగంగా వ్యాపించాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చిన పవన్ స్వయంగా ఆఫీస్ ను పరిశీలించి.. ప్రమాదం జరగడానికి గల కారణాలను కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాసేపు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో సిబ్బందితో ఇంటరాక్ట్ అయి తర్వాత వెళ్లిపోయాడు. పవన్ లాంటి వ్యక్తి జ్యోతి ఆఫీసుకు రావటం.. పరామర్శించటం ఆసక్తికరంగా మారింది. సీనియర్ జర్నలిస్ట్ రెంటెల జయదేవ్ ద్వారా విషయం తెలుసుకున్నానని చెప్పిన పవన్ మీడియా తో ఇంటరాక్ట్ కాడన్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టాడు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ బిల్డింగ్ ను స్వయంగా సందర్శించి ప్రమాద వివరాలను ఆరాతీసిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రజ్యోతికి ఆప్తుడన్న పేరున్న చంద్రబాబు ఇప్పటిదాకా పరామర్శించకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Andhra Jyothi Office  Fire Accident  

Other Articles