CBI books Singaporean for duping Chennai firm of Rs 1.67 crore వైట్ కాలర్ నేరగాళ్లు నుంచి తస్మాత్ జాగ్రత్తా..!

Cbi books singaporean for duping chennai firm of rs 1 67 crore

Chennai-based gold exporter, Grace Tann, finagler Grace Tann, RKR Gold, PTI ABS DIP, identical email addresses, Precious Metals pvt, similar email address, Chennai-based exporter, Information Technology Act, white collar offences, duping banks

The CBI has registered a case against a Singapore-based scamster who allegedly duped a Chennai-based gold exporter of Rs 1.67 crore by diverting its due payments to his personal account.

అక్షరం తేడాతో కొటిన్నర కాజేసిన కేటుగాడు

Posted: 05/03/2017 09:41 AM IST
Cbi books singaporean for duping chennai firm of rs 1 67 crore

వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా, దగా అని మహాకవి శ్రీరంగం శ్రీనివాసులు (శ్రీశ్రీ) చెప్పినట్లు.. మనకు తెలిసిన వారే కాదు. తెలియని వారి చేతుల్లోనూ.. అసలు ఎటువైపు నుంచి మనకు ఉపద్రవం వచ్చిపడుతుందో కూడా తెలియకుండానే మోసానికి గురవుతున్నాం. సాంకేతిక విప్లవాన్ని పునికి పుచ్చుకున్న నేటి తరం మనుషుల కంటే ముందుగానే దగాకోరులు వాటిని అసరాగా చేసుకుని వ్యాపారవేత్ల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. వారు ఎవర్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి ట్రాప్ చేసి దగా చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక చేతులు కాలక అకులు పట్టుకుని  ఏం లాభం అంటూ అంగలార్చడం మాత్రమే మిగులుతుంది.

సరిగ్గా ఇలాంటి మోసమే చెన్నైలోని ఓ బ్యాంకు అధికారులు చవిచూశారు. ఓ కేటుగాటు ఎంతో తెలివిగా బ్యాంకు అధికారులను బురడీ కొట్టించాడే. ఒకే ఒక్క అక్షరం తేడాతో ఈ-మెయిల్ పంపి ఏకంగా రూ.1.67 కోట్లను కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. డిసెంబరు 2013లో ఆర్కేఆర్ గోల్డ్ రూ.1.67 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సింగపూర్‌కు చెందిన వాల్యూమిక్స్ ప్రీసియస్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎగుమతి చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నగదును చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని తమ ఖాతాకు చెల్లించాల్సిన మొత్తాన్ని పంపాలని అందులో కోరింది.

ఈ రెండు సంస్థలకు మధ్యన వారదిగా వున్నది కేవలం ఈ మెయిల్ మత్రమే. బహుశా రెగ్యూలర్ ట్రాన్స్ యాక్షన్ ఉన్నాయి కాబోలు అందుకనే ఈమెయిల్ అధారాంగా లావాదేవీలన్ని పూర్తి చేస్తుంటారు. ఈ రెండు సంస్థలకు మద్య వున్న ఈమెయిల్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ డీల్ జరుగుతున్న క్రమంలోనే వారి ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అంతే క్షణాల్లో ఈ ఇద్దరి మద్య వున్న ఈ మెయిల్ కు బదులు మరో ఈ మెయిల్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. పుట్టుకోచ్చింది. నిజమైన సంస్థ పంపిన ఈ-మెయిల్‌ వెళ్లిన తరువాత క్షణాల వ్యవధిలో మరో ఈ మెయిల్ వెళ్లింది.

తమకు చెల్లించాల్సిన రూ.1.67 కోట్లను బ్యాంక్ అప్ ఇండియా అకౌంట్ కు బదులుగా హెచ్‌ఎస్బీసీ ఖాతాలో జమచేయాల్సిందిగా అందులో ఉంది. ఇది కూడా సదరు సంస్థ అకౌంటేనని భావించిన వాల్యూమిక్స్ సంస్థ. సదరు మొత్తాన్ని హెచ్ఎస్బీసీ బ్యాంక్ అకౌంట్ లో జమచేసింది. తమకు ఇంకా డబ్బు అందకపోవడంతో అర్కేఆర్ గోల్డ్ సంస్థ సుమారు వారం రోజుల తరువాత మరో ఈమెయిల్ పెట్టింది. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొనింది. ఈ ఈమయిల్ చూసిన వాల్యూమిక్స్ సంస్థ ఖంగుతినింది. తాము ఎప్పుడో డబ్బులు జమ చేసిన తనువాత కూడా మళ్లీ డబ్బులు అగడటం ఏంటని నిలదీసింది.

దీంతో రెండు సంస్థల ప్రతినిధులు కలుసుకుని తాము పంపిన లావాదేవీల ఈమియిల్ ఉత్తరప్రత్యుత్తరాలను చూసుకుని,, ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సింగపూర్‌కు చెందిన గ్రేస్ టాన్ అనే మోసగాడు ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ఈ-మెయిల్‌కు ‘ఎస్’ అనే అక్షరాన్ని చేర్చి This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. పేరుతో మెయిల్ పంపి ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. దొంగ ఈ-మెయిల్‌ను గుర్తించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగినట్టు చెబుతున్నారు. వ్యవహారం సీబీఐకి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : scam  CBI  Mail spoofing  Mail fraud  Email fraud  Phishing  Spam  chennai  singpore  

Other Articles