Modi Government has to go in for Surgical Strikes Again

India need another surgical strikes on pak

Mayawati Pakistan, Modi Another Surgical Strikes, Pakistan Mutilates Indian Soldiers, Indian Soldiers Mutilate, Mayawati AK Antony, AK Antony Surgical Strikes, Mayawati Narendra Modi, Mayawati Pakistan, AK Antony Army Free Hand, India Another Surgical Strike, One More Surgical Strike

After Pakistan Army mutilates Indian soldiers, Mayawati says People think that if the Narendra Modi government has to go in for surgical strikes again. Former Defence Minister AK Antony stated Army be given free hand to take appropriate action against Pak.

సర్జికల్ స్ట్రైక్స్ మళ్లీ చేయాల్సిందేనా?

Posted: 05/03/2017 09:52 AM IST
India need another surgical strikes on pak

పాక్ దాష్టీకమైన పనులపై దేశం మొత్తం అట్టుడుకిపోతుంది. సరిహద్దులు దాటి వచ్చిమరీ ఇద్దరు జవాన్ల తలలు నరకడంపై అంతా ఫైర్ అవుతున్నారు. ఓవైపు కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండగా, పాక్ పై దాడి చేసి నామరూపాలు లేకుండా చేయాలంటూ రాజకీయ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఈ విషయంపై ఓవైపు గళం వినిపిస్తూనే పనిలో పనిగా ప్రభుత్వం పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు కొందరు.

ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ... పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించింది. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు.. దేశ ప్రజల అభిమతం అని స్పష్టం చేసింది. పాక్ దుశ్చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. గోరక్షణ, లవ్ జిహాద్, ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలను పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్, సరిహద్దులపై దృష్టి సారించాలని సెటైర్లు వేసింది. కేవలం రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయటంలో పెడుతున్న శ్రద్ధ, సైనికుల రక్షణ పై కూడా పెడితే బావుంటుందని తెలిపింది.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సైన్యానికి స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దేశ రక్షణలో కేంద్రం మరింత సమర్థవంతంగా కఠినమైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వాలని, అలా చేస్తే...వారే ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఒకే ఒక్కసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడుసార్లు పాకిస్థాన్ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టిందని, ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకుంటే లాభం లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు పాకిస్థాన్ కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని వామపక్షాలతో సహా అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో పిలుపునిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Soldiers Mutilate  Pakistan  Surgical Strikes  

Other Articles