BJP MLC posts porn pics on WhatsApp కర్ణాటక ఎమ్మెల్సీ నిర్వాకం.. వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు

Belagavi mlc posts porn photos to whatsapp group

PORN PHOTO ON WHATSAPP,Belagavi MLC posts porn photos to WhatsApp group,Whatsapp group,Rajya Sabha,KLE society,belagavi mlc mahantesh kavatagimath,belagavi media force, mahantesh kavatagimath, bkp mlc, belagavi media force, pornographic posts, whatsapp, karnataka, policitics, India news

The pornographic pictures posted to a WhatsApp group by Belagavi MLC Mahantesh Kavatagimath (BJP) were much discussed across the district.

కర్ణాటక ఎమ్మెల్సీ నిర్వాకం.. వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు

Posted: 05/03/2017 08:53 AM IST
Belagavi mlc posts porn photos to whatsapp group

కంచె చేను మేసిన చందంగా వుందీ ప్రజాప్రతినిధులు తీరు. తాము చట్టాలను చేస్తామంటూ హూంకరించే నేతలు.. వారే చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఆ మధ్య ఓ తెలుగు దేశం నేత తమ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేసి విమర్శల పాలైన సంగతి మర్చపోకముందే.. పోరుగు రాష్ట్రంలోని ఓ నేత.. ఎమ్మెల్సీ,, తన లేకి బుద్దులు ఇంకా పధిలంగానే వున్నాయని చాటుకున్నాడు. అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి కలకలం రేపాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఫోర్న్ స్టార్ల చిత్రాలను వాట్సాఫ్ లో పెట్టాడు.

కర్ణాటకలోని బెల్గావి పట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ మహన్ తేష్ కవతగిమాత్ రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. అపార అనుభవాన్ని గడించాడనుకుంటే లేకి బుద్దులను మాత్రమే గడించినట్లుంది. అయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు..  కేఎల్ఈ సొసైటీ పేరిట పలు విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా నిత్యం ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న నేత.. విద్యావేత్త.. ఒక్కసారిగా తనలోని మరో యాంగిల్ కూడా వుందని తన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రదర్శించాడు.

సరిగ్గా నిన్న సాయంత్రం 4.17 నిమిషాలకు తన ఫోన్ లోని బెల్గావి మీడియా ఫోర్స్ పేరిట వున్న వాట్సాప్ గ్రూపులో 50 ఫోర్ స్టార్లకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే ఈ గ్రూపులో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్ట్‌లు వున్నారు. దీనిపై పలురువు అప్పటికప్పుడే స్పందించగా, మరికోందరు రాజకీయ నేతల నిజస్వరూపం ఇదని కామెంట్లు పెట్టారు. విద్యార్ధులకు సన్మార్గంలో నడవాలని చెప్పే విద్యావేత్త  మేడి పండు తత్వం ఇదని మరికోందరు చురకలు అంటించారు. ఇలా ఏకంగా విమర్శల వర్షం కురిసింది.

ఇక మరికొందరు జర్నలిస్టులు ఏకంగా తమ విధుల్లో చురుగ్గా పాల్గొని బీజేపి ఎమ్మెల్సీ మహన్ తేష్ నిజస్వరూపం అంటూ మీడియాలో కథనాలను ప్రసారం చేశారు. దీంతో బెలగావి మీడియా ఫోర్స్ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు మహబూబ్ మకందర్ వెంటనే ఆ చిత్రాలను తొలగించినట్టు తెలిపారు. అంతేకాదు ఈ గ్రూప్ నుంచి బీజేపి ఎమ్మెల్సీ మహన్ తేష్ అకౌంట్ ను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. ఓ ప్రజాప్రతినిధే ఇటువంటి చిత్రాలను పోస్ట్ చేశారంటే ఇందులో ఏదో ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టు చేసిన అశ్లీల చిత్రాల వ్యవహారం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahantesh kavatagimath  bjp mlc  belagavi media force  pornographic posts  whatsapp  karnataka  

Other Articles