‘‘అగ్రనేతపై ప్రధాని నరేంద్రమోడీ కుట్రే ఇది’’ Babri case reopening to nix Advani's president bid

Modi s conspiracy to remove advani from president race alleges lalu prasad yadav

modi conspiracy on advani, modi betrayl advani, modi, pm modi advani, LK Advani, Babri Demolition Case, Lalu Prasad Yadav, Murali manohar Joshi, Uma Bharathi, Supreme court, Allahabad court, politics

RJD chief Lalu Prasad Yadav said that the court's decision in Babri Demolition case, is itself a conspiracy of PM Modi to remove LK Advani from Presidential election.

‘‘అగ్రనేతపై ప్రధాని నరేంద్రమోడీ కుట్రే ఇది’’

Posted: 04/19/2017 07:02 PM IST
Modi s conspiracy to remove advani from president race alleges lalu prasad yadav

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపి అగ్రనేతలు ఎల్‌కే అద్వాని, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతీలపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశమై తనదైన శైలిలో స్పందించారు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌. రాష్ట్రపతి పదవికి బీజేపి కురువృద్ద నేత ఎల్‌కే అద్వానీ పోటీ పడకుండా చేసిన కుట్రలో భాగమే ఇదని ఆయన అరోపించారు. గత సార్వత్రిక ఎన్నిలలో ఏకపక్ష మోజారిటీతో గెలిచిన బీజేపి నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకోలేదు. ఆద్వానికి మంత్రిపదవి ఇవ్వడం కన్నా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని బీజేపి పార్టీ భావించిందని, అందుకనే ఆయనను ఏకంగా రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించనున్నారని గత కొంతకాలంగా జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.

ఈ క్రమంలో రాష్ట్రపతి పదవికి బీజేపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్రపతి రేసులో వుండాల్సిన అభ్యర్థినిని పక్కనబెట్టేందుకే బాడ్రీ మసీదు కేసును తిరగదోడారని లాలూ అరోపించారు. అద్వానీ అవకాశాలపై ప్రధాని మోడీ గండికోట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి సీబీఐని పావుగా వాడుకున్నారని లాలూ ఆరోపించారు. రాష్ట్రపతిగా అగ్రనేతను చేసేందుకు చర్చలు జరిగాయని, బీజేపి చర్యతో ఇక ఆయన పేరును ఎవరూ ప్రతిపాదించకుండా చర్యలు తీసుకున్నాయిని.. కాగా అద్వానీ చలువతోనే మోదీ ప్రధానిగా ఉన్నారన్న విషయాన్ని వారు మర్చిపోయారని ఆర్జేడీ అధినేత ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles