అర్మీలో సరైన బోజనం పెట్టడం లేదన్న తేజ్ బహదూర్ డిస్మిస్ BSF jawan Tej Bahadur Yadav dismissed from service

Bsf jawan tej bahadur yadav dismissed from service wife takes to social media

BSF, BSF Jawan, Tej Bahadur Yadav, Sharmila Yadav, facebook, poor quality food, Kashmir, India

BSF trooper Tej Bahadur Yadav, whose video clip on "substandard food" served to BSF men went viral in January, was on Wednesday dismissed from service.

అర్మీలో సరైన బోజనం పెట్టడం లేదన్న తేజ్ బహదూర్ డిస్మిస్

Posted: 04/19/2017 08:12 PM IST
Bsf jawan tej bahadur yadav dismissed from service wife takes to social media

ఆర్మీ అధికారులు ఒక్కో జవాను పట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వున్నారు. తమకు వ్యతిరేకంగా సాక్షాధారాలను చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఓ సైనికుడి పట్ల ఒకలా.. అదే సోషల్ మీడియాలో ఇటీవల శ్రీనగర్ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక యువత దాడి చేసినా సంయమనం పాటించిన సైనికుడి పట్ల మరోలా వ్యవహరించారు. ఒకరిని అందలం ఎక్కించగా, మరోకరిని ఏకంగా విధుల నుంచి తప్పించారు. ఒక సైనికుడి పట్లు ఏకంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డీజీపీ ఎస్సీ వైద్ హర్షం ప్రకటించగా, మరో సైనికుడి పట్ల అర్మీ ఉన్నతాధికారులు ఏకంగా చిత్కారలు, పరిహారాల పేరుతో పరాభావాలను అనుభవించేలా చేశారు.

దేశ సరిహద్దుల్లో అహర్నిశలు తాము దేశాన్ని శత్రసైన్యాల నుంచి కాపాడే పనిలో నిమగ్నం అవుతుండగా, తమకు కనీసం కడుపునిండా బోజనం కూడా లభించడంలేదని, కాలీకాలని రొట్టేలు, ఉడికీ ఉడకనీ పప్పు.. అది కూడా పూర్తిగా నీళ్ల మాదిరిగా వుంటే ఎలా బోజనం చేస్తామని ప్రశ్నించిన సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ గుర్తున్నాడు కదూ.. ఆయను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించి.. దేశంలో కలకలం సృష్టించిన తేజ్‌ బహదూర్‌ యాదవ్ క్రమశిక్షణ తప్పాడంటూ విధుల నుంచి తప్పించారు.

ఆయన వీడియో సోషల్ మీడియాలో వచ్చిరాగానే ఆయన మతిస్థిమితం లేదని, మద్యం ప్రభావానికి గురై ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడని అరోపించిన అధికారులు.. రమారమి నాలుగు నెలల తరువాత ఆయనను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్మీలో ఆయన క్రమశిక్షణను తప్పాడని, దాంతో పాటు అతడు నిబంధనలకు విరుద్ధమైన ఎన్నో పనులు చేశాడనే ఆరోపణలు రుజువైయ్యాయని అందుచేత తేజ్ బహదూర్ యాదవ్ ను విధుల నుంచి తొలగించినట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా, ఈ విషయంపై తాను ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తానని తేజ్‌ బహదూర్‌ తెలిపాడు. నిజాలు బయటకు చెప్పాననే కక్షతో తనపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పాడు. హర్యానాలోని మహేంద్రఘడ్‌ జిల్లాకు చెందిన తేజ్‌ బహదూర్‌ 1996లో బీఎస్‌ఎఫ్‌లో చేరాడు. గత ఏడాది చివర్లో తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ఇది పెద్ద ధుమారం రేగింది. దీంతో మధ్యంతర విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అయితే విచారణ లో నాణ్యత లేని బోజనం పెడుతున్నారా..? లేదా అన్న విషయమై ఏం తేల్చారన్న విషయం మాత్రం అధికారులు వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSF  BSF Jawan  Tej Bahadur Yadav  Sharmila Yadav  facebook  poor quality food  Kashmir  India  

Other Articles