మానవత్వం పరిమళించిన ఫోటోగ్రాఫర్.. ఫోటోలు వైరల్ Photographer takes action instead of pictures in Syria

Photographer puts down camera runs to rescue boy wounded in syrian bus bombing

photograher, syrian bus bombing, Syrian Photographer, Photographer Puts Down Came, Photographer Syrian Boy Life, Syrian Photographer Run, Photographer Try To Save Kids, Photographer Breaks Down, Syrian Photographer, Takes Action Instead of Pictures, news, latest news

Every so often, a photograph cuts through the grim cacophony of the war in Syria and pierces viewers’ hearts.

మానవత్వం మూర్తీవభించిన ఫోటోగ్రాఫర్.. ఫోటోలు వైరల్

Posted: 04/19/2017 06:16 PM IST
Photographer puts down camera runs to rescue boy wounded in syrian bus bombing

ఆ ఫోటోగ్రాపర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అయితే అతను చేసిన పనుల కారణంగా అంతకుముందే ఆయన హీరో అయ్యాడు. హీరో కావాలంటే స్పందించే హృదయం వుండాలి. ఎవరైనా ప్రమదానికి గురైతే.. వారి మానాన వారిని వదిలేయకుండా.. వారికి సాయం చేసే గుణం వుంటే చాలు. ప్రమాదం ఎటునుంచి పోంచివస్తుందో మానవమాత్రులమైన మనం పసిగట్టలేం దీంతో వారిని రక్షించనూ లేము. అయితే ప్రమాదంబారిన పడి రక్తమోడుతున్న వారిని మాత్రం తప్పక రక్షించగలం. అదే పని చేసిన ఈ ఫోటోగ్రాఫర్ నిజమైన, మనస్సున్న హీరో అనిపించుకున్నాడు.

ఎవరరైనా ప్రమాదం బారిన పడితే తోటివారు సాయం అందించేందుకు బదులు సెల్పీలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడానికే అధిక ప్రాధాన్యతనిస్తూన్నారు. ఈ విషయంలో తక్షణ సాయం చేసేందుకు అక్కడికి వచ్చిన వారు కూడా తమ వృత్తి ధర్మాన్ని వీడి సెల్ఫీలు తీసుకుంటున్నారన్న అరోపణలు వస్తున్న ఘటనలు అనేకం. కానీ సిరియాలోని ఒక ఫొటోగ్రాఫర్‌ మాత్రం మానవత్వానికే ప్రాధాన్యమిచ్చాడు. మనస్సున్న మారాజు అనిపించుకున్నాడు. తన విధులను పక్కనబెట్టి.. చిన్నారులను చేతుల్లోకి తీసుకుని వారిని రక్షించేందుకు ఆయన పడ్డిన తాపత్రయం మాట్లల్లో వర్ణించలేనిది.

సిరియాలోని పశ్చిమ అలెప్పొలో రెబల్స్‌కు పట్టున్న రషీదిన్‌ వద్ద కొందరు గ్రామస్థులు తరలివెళుత్ను బస్సులను లక్ష్యంగా చేసుకుని రెబల్స్ బాంబులు పేల్చారు. ఈ బాంబుదాడిలో దాదాపు 126 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు 80 మంది చిన్నారులే. స్థానికంగా వున్న ఫోటోగ్రాఫర్ అబ్ద్‌ అల్‌ఖదర్‌ హబక్‌ బాంబు విస్పోటనానికి షాక్ కు గురయ్యాడు. అచేతనంగా పడివున్న చిన్నారులు మృతదేహాలు, రక్తపు గాయాలబారిన పడిన చిన్నారుల హాహాకారలు, ఈ యావత్ ఘటనను చూసి గుండెలవిసేలా విలపిస్తున్న స్థానికుల అర్థనాధాలతో వెంటనే తేరుకుని హబక్.. కాసేపు కెమేరాలను పక్కన పెట్టేయాలని సహచరులకు చెప్పి క్షతగాత్రులను కాపాడేందుకు రంగంలోకి దిగాడు.

తొలుత ఒక చిన్నారి వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే ఆ బాలుడు చనిపోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోనే గాయాలతో పడిఉన్న మరో బాలుడి వద్దకు వెళ్లాడు. అతను వూపిరి తీసుకోవడానికి అవస్థ పడుతున్నట్లు గమనించిన హబక్‌ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బాలుడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌ వద్దకు చేర్చాడు. తర్వాత మరో బాలుడిని కాపాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన హబక్‌ మోకాళ్లపై కూలబడిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాలన్నిటిని సమీపంలో ఉన్న వేర్వేరు ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేలసార్లు షేర్‌ అయ్యాయి. నెటిజన్లు హబక్‌ మానవత్వం మూర్తిభవివించిన మనిషికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : news  photograher  Abd Alkader Habak  syrian bus bombing  

Other Articles