తమిళ నటి వరలక్ష్మీ కిడ్నాప్.. బట్.. సేఫ్..! actress varalakshmi kidnap photo went viral in social media

Tamil actress varalakshmi kidnap photo went viral in social media

varalakshmi sharat kumar, actress kidnap, tamil actress kidnap, kidnap went awry, actress kidnap went awry, varalakshmi sharat kumar' denies kidnap

young Tamil actress Varalakshmi Sharat Kumar is seen tied to a cot went viral on the internet and also caused a lot of anxiety among her fans.

తమిళ నటి వరలక్ష్మీ కిడ్నాప్.. బట్.. సేఫ్..!

Posted: 04/18/2017 11:53 PM IST
Tamil actress varalakshmi kidnap photo went viral in social media

తమిళ నటి వరలక్ష్మి కిడ్నాప్ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. అందులో ఆ నటి నిజంగానే మంచానికి కట్టేసి వుంది. ఇక కాళ్లు కూడా కట్టేశారు. అంతటితో అగని కిడ్నాపర్లు అమె నోటికి కూడా ప్లాస్టర్ వేసారు. ఈ ఫోటో వైరల్ కావడంలో దీనిని చూసిన అమె అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. కేరళకు చెందిన నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల ఘటనను మర్చిపోకముందే మరో నటిపై దుండగులు అలాంటి తరహాలోనే వ్యవహరించారని నటి కిడ్నాప్ ను తీవ్రంగా ఖండించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేశారు.

దీనిపై సమాచారం అందుకున్న నటి వరలక్ష్మీ మాత్రం తాను కిడ్నాప్ అయ్యానన్న వార్తలను తీవ్రంగా ఖండించింది. అయితే, తనను మంచానికి కట్టేసిన ఫోటోను తన రాబోయే చిత్రంలోనిదని స్పష్టం చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం ప్రచారం నిమిత్తం ఈ ఫొటోను తమ చిత్ర యూనిట్ పోస్ట్ చేసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరలక్ష్మి తెలిపారు. అయితే దీనిపై మాత్రం అమె అభిమానులు మండిపడుతున్నారు. నటీమణుల అపహరణలు జరుగుతున్న క్రమంలో ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి.. చీఫ్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడటం సహేతుకం కాదని తేల్చిచెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varalakshmi  tamil actress  movie promotion  kidnap  kollywood  

Other Articles