పన్నీర్ పాచిక పారింది... చిన్నమ్మ కుటుంబం అవుట్... వాట్ నెక్స్ట్ | Sasikala, TTV Dinakaran sidelined from AIADMK.

Sasikala dinakaran ousted as aiadmk factions bury hatchet

Sasikala Family, Mannargudi Mafia AIADMK, Sasikala Mannargudi Mafia, Sasikala Dinakaran Expel, AIADMK Dinakaran Notices, Palaniswamy Panneerselvam Together, Panneerselvam Back to AIADMK, OPS Sketch, OPS Sasikala, Tamil Nadu Politics

After Sasikala Family aka Mannargudi Mafia expelled from AIADMK Tamil Nadu Political drama isn't over yet.

మన్నార్ గుడి మాఫియా అవుట్.. వాట్ నెక్ట్స్

Posted: 04/19/2017 08:04 AM IST
Sasikala dinakaran ousted as aiadmk factions bury hatchet

మన్నార్ గుడి మాఫియాకు చెక్ పెడుతూ శశికళ కుటుంబంను అన్నాడీఎంకే పార్టీ వేసిన వెంటనే పరిణామాలు మారిపోతున్నాయి. చిన్నమ్మ అండ్ కో కు పార్టీతో సంబంధం లేదని 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా, దానిని బలపరుస్తూ మెజార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. తామంతా ఐక్యంగా ఉన్నామన్న విషయాన్ని ప్రకటించిన మంత్రి జయకుమార్ శశికళ, దినకరన్ కు పార్టీతో సంబంధం లేదని ప్రకటించాడు.

ఈ నిర్ణయంపై రగిలిపోయిన చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ ఆధిపత్యం చూపించే దిశగా అడుగులు వేస్తున్నాడు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి కుట్రపూరితంగా తొలగించి, పార్టీ నుంచి గెంటేస్తారా? అంటూ మండిపడుతున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాడు. ఈ సందర్భంగా ఆ పది మంది ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు వ్యతిరేక నినాదాలు చేయటం విశేషం.

ఈ మేరకు చిన్నమ్మకు జరిగిన అన్యాయంపై చర్చించేందుకు తేని జిల్లా నేతలకు ఆహ్వానం పంపాడు. ఓవైపు ఓ కేసు విషయంలో బెంగళూరు కోర్టుకు హాజరు అవుతుండటం, పార్టీ గుర్తు రెండాకుల కేటాయింపుకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు విచారణ, ఆపై అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో దగ్గరి నేతలతో చర్చించనుండడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు పార్టీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చే ఆలోచనలో దినకరన్, పార్టీలోఎవరూ తనకు వ్యతిరేకంగా లేరని, అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధమని ప్రకటించాడు.

ఆ మంత్రుల్లో టెన్షన్...

చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు దినకరన్‌ గెలుపు కోసం అన్నా డీఎంకే ‘నోట్ల కట్టల డీల్’ కుదర్చున్న విషయం వెలుగులోకి రావటం, అనంతం ఐటీ అధికారులు సోదాలు చేసే సమయంలో మంత్రి విజయభాస్కర్‌ నివాసంలో 89 కోట్ల రూపాయలు దొరకటం విదితమే. అయితే ఆ జాబితాలో అన్నాడీఎంకేకు సంబంధించిన మంత్రులు ఎవరికి ఎంత? మొత్తం అందజేసిందన్న పూర్తి వివరాలు ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి.

ఒక్కో మంత్రికి ఉపఎన్నికల్లో పంచేందుకు ఐదారు కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయలు అందజేసి, పంపకాలు చేయమని ఇచ్చినట్టు ఉందన్న విషయం కూడా బహిర్గతమైంది. అంతే కాకుండా ఆ మొత్తం ఎవరెవరికి ఇచ్చారో కూడా వివరంగా ఉందని, ప్రధానంగా ఏడుగురు మంత్రుల పేర్లు ఉన్నాయని తమిళనాట వార్తలు వెలువడ్డాయి.

దీంతో వారంతా దినకరన్ వద్దకు వెళ్లి...తమకు కేవలం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అయితే విజయభాస్కర్ జాబితాలో మాత్రం తమకు ఇచ్చిన దానికి రెట్టింపు కంటే మూడు నాలుగు రెట్లు చూపించారని విన్నవించుకున్నారు. దీంతో అందరి అనుమానాలు మంత్రి విజయభాస్కర్‌ వైపు మళ్లాయి. ఆయన లేదా అనుచర బృందమే ఈ డబ్బును కాజేసి, మంత్రులకు ఇచ్చినట్లు జాబితా తయారు చేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దీనిపై దినకరన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని, అయితే ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడంతో ఆ లెక్కలు మరుగును పడిపోయే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. తన స్కెచ్ తో పంతం నెగ్గించుకుని తిరిగి పార్టీలోకి వస్తున్న పన్నీర్ సెల్వంకు తిరిగి ఆర్థిక శాఖే కట్టబెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  AIADMK  Sasiakala Family  Expel  

Other Articles