‘‘బాబూ.. మీరోచ్చి మూడేళ్లైనా.. జాబు రాలేదు’’ యువకుడి మరణవాంగ్మూలం.. "babu fullfill election promises" youth urges in suicide letter

Babu fullfill election promises youth urges in suicide letter

Student , Andhra Student, Unemployed Youth, suicide letter, AP CM, Chandrababu, Youth letter, AP Youth Writes Letter To CM Chandrababu Before Committing Suicide, vishakapatnam, crime

Pitani Siva Durga Prasad from Marripalem of Visakhapatnam district had commited suicide on a railway track, as he was jobless. Who wriiten a letter to cm asked to fullfill his election promise.

‘‘బాబూ.. మీరోచ్చి మూడేళ్లైనా.. జాబు రాలేదు’’ యువకుడి మరణవాంగ్మూలం..

Posted: 04/18/2017 09:36 PM IST
Babu fullfill election promises youth urges in suicide letter

నవ్యాంధ్ర ప్రజల వృద్ది కోసం తమ పార్టీనే గెలిపించాలని, ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పిన తనతోనే సాధ్యమని, బాబు వస్తేనే జాబు వస్తుందన్న ప్రచారం.. నిరుద్యోగ యువతకు భృతి కల్పన వంటి అవకాశవాద ఎన్నికల హామీలను అనేకం గుప్పించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. తమ హామీలను మర్చిపోతున్నాయి. బాబు మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది, కానీ మాకు మాత్రం జాబు రాలేదు అంటూ అవేదన భరితంగా తన గుండెలోతుల్లోని బాధను ఓ లేఖ రూపంలో రాసుకున్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా మర్రిపాలెంకు చెందిన  పితాని శివదుర్గా ప్రసాద్ నిరుద్యోగి. గత ఎన్నికల ముందు బాబు వస్తే బాబు వస్తుందన్న ఎన్నికల హామీలను, టీవీ ప్రకటనలను విశ్వసించి బాబు రావాలని కోరుకోవడంతో పాటు తన ఓటును కూడా టీడీపీ పార్టీకే వేశాడు, ఒకటి రెండు మూడేళ్లు పూర్తికావస్తున్నాయి., ఇక తనకు ఉద్యోగం రాదని, ఉపాధి అవకాశం దోరకదని అవేదన చెందిన యువకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన బాధను, అవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

జాబు లేని కారణంగా రెండేళ్ల కిత్రమే పెళ్లైనా పోషించలేనన్న కారణంగా తన భార్య కూడా తనను వదిలేసి వెళ్లిపోయిందని, ఇది తనలాంటి నిరుద్యోగ యువతకు కనువిప్పు కావాలని లేఖలో పేర్కోన్నాడు, అయితే యువత తనలా అత్మహత్యకు పాల్పడవద్దని, సాధ్యమైతే ప్రత్యేక రైల్వే జోను కోసం పోరాడాలని, అది సాధ్యమైతే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని దుర్గా ప్రసాద్ లేఖలో పేర్కోన్నాడు. కాగా, రాజకీయ నేతలు తాము అధికారంలోకి రావాలని అబద్దపు ప్రచారాలు చేసి బంగారు భవిష్యత్తు వున్న యువత జీవితాలతో అడుకోవద్దని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Student  Andhra Student  Unemployed Youth  suicide letter  AP CM  Chandrababu  

Other Articles