లండన్ లో విజయ్ మల్యా అరెస్టు.. Vijay Mallya arrested in London by scotland yard police

Vijay mallya arrested in london by scotland yard police to be produced in court

Vijay mallya arrest, Vijay Mallya, Mallya arrest, Mallya, liquor baron, vijay mallya arrested, scotland yard police, london west minister court, UK

liquor baron Vijay Mallya, was arrested in the UK by Scotland Yard on India's request for his extradition and will produce him in Westminster Magistrates' Court in London.

లండన్ లో విజయ్ మాల్యా అరెస్టు.. త్వరలో భారత్ కు రప్పించే అవకాశం..

Posted: 04/18/2017 03:36 PM IST
Vijay mallya arrested in london by scotland yard police to be produced in court

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడైన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ దేశంలోని పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు సుమారు 9 వేల కోట్ల పైచిలుకు రూపాయలను ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడైన విజయ్ మాల్యను స్కాంట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. విందులకు, విలాసాలకు మారుపేరుగా నిలచి.. ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిష్ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కింది. ఆయనను కాసేపట్లో స్థానిక వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానంలో హాజరపర్చనున్నారు.

బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయలను రుణంగా పొందిన విజయ్ మాల్యా.. వాటిని తీర్చేందుకు పలు షరుతులు పెడుతూ వచ్చారు. అసలు ఈడీకి తన వ్యాపార వ్యవహారాల గురించి ఏం తెలుసునంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతటితో అగకుండా తాను ఇక భారత దేశానికి పోరబాటున కూడా రానని సంకేతాలను కూడా పంపించారు. తాను తీసుకున్న రుణాలలో అసలులో కూడా కొంత మాత్రమే చెల్లిస్తానని. ఇందుకు సమ్మతించాలని ఆయన తన తరపు న్యాయవాదితో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేయిందారు.

తొలుత తనను దేశ అర్థిక నేరస్థుడని పతకా శీర్షికలను పెట్టిన దినపత్రికలను, మీడియాలపై కూడా ఆయన బ్లాక్ మెయిల్ చేసే ధోరణిలో వ్యాక్యలు చేశారు. తాను చేసిన మేలు.. సహాయాలను మీడియా సహా మీడియా యాజమాన్యాలు కూడా మర్చిపోయాయని, తనను నేరస్థుడిగా పరిగణిస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే భారత్ కు తిరిగి వస్తానని అన్నారు. ఇలా పూటకో రకంగా మాట్లాడుతూ.. ప్లేటు ఫిరాయించిన మాల్యాను అరెస్టు చేసి తమకు అప్పగించాలని భారత్ లండన్ పోలీసులను కోరింది.

దీంతో గత కొంత కాలంగా లండన్‌లోనే ఉంటున్న మాల్యాను అక్కడి స్కాట్లాండ్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. స్థానిక వెస్ట్ మినిస్టర్ కోర్టులో హజరుపర్చనున్నారు. దీంతో లండన్ పోలీసుల నుంచి మాల్యను భారత్ రప్పించేందుకు భారత్ సీబిఐ అధికారులు కూడా సన్నధమయ్యారు. ఆ తర్వాత నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి తీసుకురానున్నారు. ఇందుకోసం సీబిఐ బృందం సభ్యులు లండన్ బయలుదేరి వెళ్తున్నారు. ఆయనను అక్కడి నుంచి భారత్ తీసుకువచ్చేందుకు అప్పుడే ప్రయత్నాలను కూడా సీబిఐ అధికారులు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles