‘‘న్యాయం చేయండీ ‘బాబు’ అంటే.. దుష్ర్ఫచారం చేయిస్తారా’’ TDP MP revolts against Chandrababu Naidu

Chittoor mp justifies his outbursts against cm chandra babu

TDP MP Shiva prasad, chitoor MP Shiva prasad, TDP leadership own agenda, chandrababu personal agenda, MP slams own party, MP slams his government, shiva prasad slams tdp leadership, siva prasad slams chandra babu, ambedkar birth anniversary

TDP MP from Chittoor, N Shivaprasad, has raised the banner of revolt against the party leadership and said he could contest as the candidate of many other parties in the next elections.

‘‘న్యాయం చేయండీ ‘బాబు’ అంటే.. దుష్ర్ఫచారం చేయిస్తారా’’

Posted: 04/16/2017 12:53 PM IST
Chittoor mp justifies his outbursts against cm chandra babu

దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి.. ఇకనైనా న్యాయం చేయండీ బాబు అని పార్టీ అధినేత చంద్రబాబునాయుడును తాను కోరినందునే తనపై నిందలు మోపుతున్నారని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అరోపించారు. తనపై లేనిపోని కట్టుకధలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు, తాను టీడీపీ ఎంపీనన్న విషయాన్ని కూడా మర్చిపోయిన అధినేత తన వర్గానికి చెందిన టీడీపీ నేతలతోనే తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు చేసిన లబ్ది ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు, దళితులకు డీకేటీ భూములను ఇచ్చారా.? అది మీ ఎన్నికల హామీ కాదా.? అని ప్రశ్నించారు. తనను కలిసి సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున తరలి వచ్చిన దళిత సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు. తమ వర్గం ప్రజలకు న్యాయం చేయాలని అడగటమే తప్పయిపోయిందని ఈ సందర్భంగా శివప్రసాద్ వ్యాఖ్యానించారు.

బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదెందుకని ప్రశ్నించడంతోనే తనపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు మురుగునిధులై వెనక్కి వెళ్లిన విషయం నిజం కాదా అని నిలదీస్తే.. తనపై వ్యక్తిగత అజెండాతో వెళ్తున్నారని నిందలు మోపారని ఆయన ఆరోపించారు. కాగా, టీడీపీ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, తదుపరి ఎన్నికలలో తనకు టిక్కెట్ ను కేటాయించకపోవచ్చునని వార్తలు రావడంపై కూడా ఆయన స్పందించారు.

తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతేనేం అనేక ఇతర పార్టీలు టిక్కెట్లు ఇస్తాయని ఆయన చెప్పుకోచ్చారు. బంధుప్రీతికి టీడీపీలో స్థానం లేదని చెబుతున్న చంద్రబాబు.. తన తనయుడు నారా లోకేష్ కు మంత్రి పదవిని ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. పేరుకు మాత్రం దళితులకు అండగా వుంటూమని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. నిజానికి వారికి చేసిందేమీ లేదని శివప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, అయితే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన శివప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  chitoor MP  MP Shiva prasad  chandrababum  Tele-conference  SC  ST  ministry  government  

Other Articles