మాజీ మంత్రి, దేవినేని ఇక లేరు | TDP Leader Devineni Nehru is no more.

Tdp leader devineni nehru died

Devineni Nehru, Devineni Nehru, Devineni Nehru Cardiac Arrest, Devineni Rajasekhar Death, Devineni Nehru Son, Devineni Nehru Death, Devineni Nehru Passes Away, Devineni Nehru Brother, Devineni Nehru Minister, Devineni Nehru News, Devineni Nehru No More, Devineni Nehru Real Name

TDP Leader Devineni Nehru Dies Of Cardiac Arrest.

ITEMVIDEOS:దేవినేని నెహ్రూ హఠాన్మరణం

Posted: 04/17/2017 07:40 AM IST
Tdp leader devineni nehru died

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇక లేరు. సోమవారం ఉదయం గుండె పోటుతో ఆయన మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వేకువ ఝామున ఛాతీలో నొప్పి రావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా, ఉదయం 5.20కి తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం.

నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. 1954 జూన్ 22న విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు రామకృష్ణ వర ప్రసాద్. రాజకీయాల్లోకి రాక ముందు నెహ్రూ వ్యవసాయం చేసేవాడు. కాగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా(కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, తూర్పు నియోజకవర్గం నుంచి ఓ సారి) గెలుపొందిన ఎన్టీఆర్ హయాంలో 1994 నుంచి 1996 వరకు నెహ్రూ మంత్రిగా పనిచేశారు. బెజవాడ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన రావుపై పోటీ చేసి గెలిచారు.

 

కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కానీ రాజకీయాల్లో ఉండాలంటే ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అలాగే ఉండిపోయారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చివరకు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత గూటికి చేరిపోయారు. నెహ్రూ భార్య పేరు లక్ష్మీ. కొడుకు, కూతురు ఉన్నారు. అనారోగ్యం కారణంగా దేవినేని నెహ్రూ తన కొడుకు అవినాష్ ను రాజకీయాల్లోకి ప్రధానంగా తెరపైకి తీసుకు వచ్చారు.

సోదరుడి మృతి వార్త తెలుసుకున్న ఏపీ మంత్రి దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి బయలు దేరారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలించనున్నట్లు బంధువులు వెల్లడించారు. ఇక నెహ్రూ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కొడెల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా లోటని చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devineni Nehru  Passes Away  

Other Articles