సిక్కిం ఉపఎన్నికలలో బీజేపికి షాక్..! డిపాజిట్ గల్లంతు BJP loses assembly by-poll to Sikkim Democratic Front

Bjp loses assembly by poll to sikkim democratic front

Sikkim Democratic Front, SDF, Dilli Ram Thapa, BJP, Suresh Khanal Sharma, Upper Burtuk assembly by-poll, Election Commission, Congress

Ruling Sikkim Democratic Front (SDF) candidate Dilli Ram Thapa defeated BJP's Suresh Khanal Sharma to win the Upper Burtuk assembly by-poll, garnering over 8,000 votes.

సిక్కిం ఉపఎన్నికలలో బీజేపికి షాక్..! డిపాజిట్ గల్లంతు

Posted: 04/16/2017 12:01 PM IST
Bjp loses assembly by poll to sikkim democratic front

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలలో తన ఉనికి చాటుకుంటూ.. జన ప్రభంజన మద్దతు తనకే ఉందని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి.. తొలిసారిగా కనీవినీ ఎరుగని షాక్ తగిలింది, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తగిలిన గాయాన్ని ఇతర రాష్ట్రాలలో విజయంతో సరిపెట్టుకుని ముందుకు సాగుతున్న తరుణంలో తాజాగా సిక్కిం రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో అతిపెద్ద షాక్ తగిలింది.
 
సిక్కింలోపి అప్పర్ బుర్టుక్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి కనీసం డిఫాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ నియోజకవర్గంలో మళ్లీ అధికార పార్టీ విజయఢంకాను మ్రోగించింది. నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తలిసిందే.

ఈ ఫలితాల్లో అధికార సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) అభ్యర్థి దిల్లీ రామ్‌ థాపా విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో 9,427 ఓట్లు పోలవ్వగా విజేత రామ్ థాపాకు 8,406 ఓట్లు వచ్చాయి. ఆయనకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్‌ ఖనల్‌ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే రావడంతో డిఫాజిట్ గల్లంతయ్యింది. దీంతో బీజేపీ ఘోరా పరాజయం చవిచూసింది. ఇక ఉపఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ సహా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా డీఫాజిట్లు కోల్పోయారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh