క్రికెటర్ల దుస్సాహసం.. దేశవ్యాప్తంగా ఆగ్రహం.. Kashmiri cricket club wears Pakistani jersey, sings anthem

This kashmiri cricket team wore pak s jersey while playing match

kashmir cricket club, kashmir cricket, j and k cricket, kashmir cricket pakistan, kashmir pakistan, kashmir pakistan anthem, kashmir pakistan cricket jersey, pakistan cricket jersey, pak cricket, cricket news, sports news

A video of a Kashmiri cricket club donning the Pakistani cricket team’s uniform stirred up social media on Monday. The match took place at Wayil grounds in Kashmir’s Ganderbal district

ITEMVIDEOS: క్రికెటర్ల దుస్సాహసం.. దేశవ్యాప్తంగా ఆగ్రహం..

Posted: 04/05/2017 02:13 PM IST
This kashmiri cricket team wore pak s jersey while playing match

పాలు తాగి తల్లి రోమ్మునే గుద్దే సంతానం ఎంతవెతికినా కనిపించదు.. కానీ భారతమాత కన్నబిడ్డలుగా చలామణి అవుతూ.. ఇక్కడ సర్వసుఖాలను, ప్రభుత్వ పథాకాలను పోందుతూ.. కడుపు నిండిన తరువాత పరాయి దేశ పాట పడటం ఎంత దుర్మార్గమో వీరిని చూస్తే అర్థమవుతుంది. జమ్మూకశ్మీర్‌ లోని ఓ స్థానిక క్రికెట్ క్లబ్ ఇలాంటి చర్యను చేపట్టింది. బరితెగించి మరీ దుస్సాహసానికి పాల్పడింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపే తీరు ఇది కాదని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున్న అగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.

దేశ ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ వెళ్లి అక్కడ పర్యటించిన నేపథ్యంలో స్థానిక క్రికెట్ క్లబ్ ఆటగాళ్ల... ఏకంగా పాకిస్థాన్ జెర్సీలు ధరించి క్రికెట్ ఆడారు. అంతేకాదు ఇరు జట్టు సభ్యులు పాకిస్థాన్ జాతీయగీతాన్ని అలపించడంతో పాటు ఆ గీతానికి గౌరవసూచకంగా నిలబడ్డారు. ఈ ఘటన వివరాలు గురించి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే తీవ్ర విమర్శల దుమారం రేగింది. ఇది రాజద్రోహంగా పరిగణించాల్సిన నేరమని.. ఎందుకు ఉపేక్షిస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నెట్ జనులు నిలదీస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించి చెనాని-నస్రి సొరంగ మార్గాన్ని ప్రారంభించిన సమయంలో.. గాందెర్బల్‌ జిల్లాలోని వయిల్ గ్రౌండ్స్‌ లో క్రికెట్ ఆడిన స్థానిక జట్టు కేవలం పాకిస్థాన్ జెర్సీలు ధరించి క్రికెట్ అడారు. అంతటితో అగకుండా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏకంగా పాకిస్థాన్ జాతీయగీతాన్ని ఆలపించి.. ఆ గీతం అలపిస్తున్నంత సేవు వారు గౌరవంగా నిల్చున్నారు. కొందరు పాక్ జాతీయ గీతాన్ని సైతం అలపించారు.

కశ్మీర్ జట్టు ధరించిన పాక్ జెర్సీలపై బాబా దార్య ఉద్ దిన్ పేరు రాసివుంది. ప్రముఖ సూఫీ సాధువు అయిన బాబా దార్య ఉద్ దిన్ దర్గా గాందెర్బల్‌ లోనే ఉండడం విశేషం. కాగా, కశ్మీర్ జట్టుతో తలపడిన జట్టు వైట్ జెర్సీలు ధరించినా వారు కూడా పాక్ జాతీయ గీతం అలపిస్తున్న సేపు గౌరవసూచకంగా నిలవడం గమనార్హం. ఇంతలా దేశాన్ని అవమానించేలా క్రీడాకారులు చర్యలు చేపడుతున్న కూతవేటు దూరంలోనే వున్న పోలీస్ స్టేషన్ లోని పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా. చర్యలు మాత్రం ఇప్పటికే తీసుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  india  arch rival  pakistan cricket  sportsperson  unrest in kashmir  kashmir cricket club  

Other Articles