బీరు, రెడ్ వైన్ ధరలకు త్వరలో రెక్కలు.. Cheers to dress made from beer..

Cheers to uwa scientists dress made from beer

university of western australia, australia scientists, Scientist Gary Cass, artist Donna Franklin, red wine, beer, dress, Nollamaram, beer dress, wine dress

Scientist Gary Cass and artist Donna Franklin research been sucessful as both who worked to create a dress made from fermented beer.

త్వరలో బీర్, వైన్ ధరలకు రెక్కలు.. ఎందకనో తెలుసా..?

Posted: 04/05/2017 12:40 PM IST
Cheers to uwa scientists dress made from beer

ఇక తొందరలో బీర్ ధరలను అకాశానంటుతాయి. ఇప్పటికే కాస్ట్లీ మద్యంగా వున్న రెడ్ వైన్ కూడా మరింత ధర పెరిగే అవకాశం వుంది. అదేంటి వేసవి కాబట్టి బీర్ ధర పెరగడంలో తప్పులేదు కానీ వైన్ ధర ఎందుకు పెరగనుంది అని అంటున్నారు కదూ. కానీ ఇది నిజం ఇప్పటికే రెడ్ వైన్ తో దుస్తులను తయారు చేయగల సామర్థాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు 2007లో అ దిశగా అడుగులు వేశారు. కాగా తాజాగా బీర్ తో కూడా దుస్తులను తయారు చేయగలమని రుజువు చేశారు. దీంతో ఇక వస్త్ర తయారీ రంగంలో వీటి వినియోగాలు అధికం కానున్న నేపథ్యంలో ధరలు పెరుతాయని మధ్య ప్రియులు అందోళన చెందుతున్నారు.

మనం నిత్యం ధరించే వస్త్రాలు ఎలా తయారవుతాయంటే.. రమారమి అందరికీ తెలిసిందే. పత్తి లేదా నార నుంచి తీసిన దారాలతో దుస్తులు తయారు చేస్తారు. కానీ యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా బయోలజీ ల్యాబ్‌ కు చెందిన శాస్త్రవేత్తలు వైన్‌, బీరులను కేవలం తాగడానికి మాత్రమే కాదు దుస్తులు తయారు చేసేందుకు కూడా వినియోగించవచ్చని నిరూపించారు. వైన్, బీరుతో దుస్తులు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైన్ తో 2007లోనే దుస్తులు తయారు చేసిన శాస్త్రవేత్తలు.. తాజాగా బీర్ తో కూడా దుస్తులను తయారుచేయగలమని నిరూపించారు.

బీరును బాగా పులియబెట్టి వస్త్రంగా మార్చారు. ‘యాక్సెటోబేటర్‌’ అని పిలిచే బాక్టీరియా కల్చర్‌ తో అసాధారణ, విప్లవాత్మకమైన వస్త్రాన్ని సృష్టించారు. ఈ విధానంలో బాగా పులిసిన రెడ్‌ వైన్‌ ను బాక్టీరియా సూక్ష్మ నూలిపోగులతో కూడిన పదార్థంగా మార్చేస్తుందని వారు చెప్పారు. వీటితో దుస్తులను తయారు చేస్తామని చెప్పారు. అయితే వైన్ తో తయారు చేసిన దుస్తుల కన్నా బీర్ తో తయారు చేసిన దుస్తులు కొంత బలంగా వున్నాయని తెలిపారు. వైన్ తో తయారు చేసిన దుస్తులు మరీ బలహీనంగా వున్నాయన్న విషయం శాస్త్రవేత్తలు ఇదివరకే స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : university of western australia  Scientist Gary Cass  Nollamaram  beer dress  wine dress  

Other Articles