ముంబైకి పోంచి వున్న ముప్పు.. ఐఎస్ ఉగ్రవాదుల చోరబాటు..? Mumbai on high alert: Terror suspects trying to sneak

Mumbai on alert post reports of isis terrorists trying to enter city by sea

CoastGuard, Mumbai highalert, Mumbai on highalert, Mumbai terror, Mumbai terror attack, terror attack. Indian Intelligence bureau, mumbai police, Indian coast guard, ISIS terrorists, security forces, Indian financial capital

Mumbai has been put on high alert as certain terror suspects are trying to enter Mumbai. Indian coast guard is also on high alert after the intelligence report.

హై అలర్ట్ లో దేశ ఆర్థిక రాజధాని.. ఉగ్రవాదుల చోరబాటు..?

Posted: 04/05/2017 02:52 PM IST
Mumbai on alert post reports of isis terrorists trying to enter city by sea

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశీయ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నగరాన్ని అప్రమత్తం చేసింది. ముంబై నగరంలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి వస్తువులు కనిపించినా వాటి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముంబై నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడేందుకు కుట్రలు పన్నుతున్నారన్న హెచ్చరికల నేపథ్యంలో మహారష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ మేరకు మహారాష్ట్ర సర్కార్ ను దేశీయ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరించాయి. మరీ ముఖ్యంగా ఐఎస్ఐఎస్ కు చెందిన ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు తీరప్రాంతం గుండా ముంబై నగరంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి రైలులో ముంబై నగరంలో సంచరించేందుకు.. దాడులకు పాల్పడేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని సమాచారాన్ని అందించడంతో అటు రైల్వే పోలీసులతో పాటు ఇటు ముంబై పోలీసులు రైల్వే స్టేషన్లపై నిఘాను పెట్టాయి. దీంతో అటు ఇండియన్ కోస్టల్ గార్డులు కూడా అప్రమత్తం అయ్యారు. తీరప్రాంతం నుంచి ఎవరు భారత భూభాగంలోకి ప్రవేశించకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.

సోలీసులతో పాటు ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాలన్నారు. నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ముంబైలో చొరబడ్డారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ హెచ్చరికల నేపథ్యంలో ముంబై నగరం పోరుగునే వున్న రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముంబై నుంచి వచ్చే దారుల్లో నిఘాను ఏర్పాటు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high alert  mumbai  coast guard  ISIS terrorists  financial capital  intelligence bureau  

Other Articles