అడవిలో బైక్ రేసర్లకు కనిపించి.. అదృశ్యమైంది ఎవరు..? Small Human-Like Creature Takes Off On Dirt Road In Indonesia

Mysterious lost pygmy tribe member of indonesia been caught on camera

A HALF-naked man, pygmy man, pygmy leaping from trees, pygmy in Indonesia, lost pygmy tribe, bike racers group, bike racers filmed pygmy, Banda Aceh, island of Sumatra, sumatra islands, tribe of indonesia, bike racers, caught on camera, viral videos, viral news

A HALF-naked man seen leaping from trees in Indonesia has sparked theories he is a member of a lost pygmy tribe. A group of bikers filmed the moment the “tribesman” suddenly jumped out in front of them near Banda Aceh on the island of Sumatra.

అడవిలో బైక్ రేసర్లకు కనిపించి.. అదృశ్యమైంది ఎవరు..?

Posted: 03/28/2017 06:43 PM IST
Mysterious lost pygmy tribe member of indonesia been caught on camera

ఆడవిలో పిల్లదారి వెంట వెళ్లున్న బైక్ రేసర్లకు ఓ వింత మనిషి కనిపించాడు. తన మానాన తాను వెళ్తున్న వింత మనిషి పోదలను మాటుగా చేసుకుని అటుగా వస్తున్న బైక్ లను గమనించసాగాడు. అవి రమారమి దెగ్గరకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా వాటికి అడ్డంగా దూకాడు. అంతే ముందు వస్తున్న బైక్ రేసర్ గుండెలు అమాంతం అగినంతపనైంది. నమ్మదిగానే వస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. ఔరా తనను భయపెట్టింది ఎవరు అని అప్పుడు మళ్లీ కళ్లు పెద్దవి చేసుకును చూడసాగాడు. కేవలం మూడున్నర అడుగుల పొడవు ఉండి చేతిలో మాత్రం తనకంటే రెండింతలు పొడువైన కర్రతో వున్న అర్థనగ్న వ్యక్తిని చూశాడు.

మరోలా చెప్పాలంటే అతనో అడవి తెగకు చెందిన మనిషి. ఔరా ఈ రోజుల్లో కూడా అడవికి చెందిన తెగలు వున్నాయా..? అన్న ప్రశ్న మీలోనే కాదు బైక్ రేసర్లలో కూడా ఉత్పన్నమైంది. ఆ తెగ పేరు పిగ్మీ, కొందరు వారిని మాంటే తెగ మానవులుగా పరిగణిస్తారు. అయితే ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఈ తెగకు చెందిన వ్యక్తలు ఇంకా ఉన్నారా? ఇప్పుడీ ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. అయితే ఉన్నారని బైక్ రేసర్లు గంటాపథంగా చెబుతున్నారు. అంత గ్యారంటీగా చెప్పడానికి వారి వద్ద సాక్షాలు కూడా వున్నాయి. అదే వీడియో ఫూటేజ్. తమ బైక్ రైడింగ్నంతా రికార్డింగ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో పిగ్మీ తెగకు చెందిన వ్యక్తి కూడా తమ కెమెరాలకు చిక్కాడు.

ఇదంగా జరిగిందెక్కడా..? అంటున్నారా.? ఇండొనేషియాలో సుమత్రా దీవులలో బాండా అఖే ప్రాంతంలో అడవీ మార్గంలో కొందరు బైక్‌ రైడర్లు ఓ అడవిలో మట్టి రోడ్డులో వెళ్తున్నారు. బండా అఖే వద్ద వారికి పిగ్మీ తెగకు చెందిన ఓ మానవుడు అర్ధనగ్నంగా, చేతిలో కర్ర పట్టుకొని కనిపించాడు. దీంతో, రైడర్లలో ఒకరు అదుపు తప్పి కిందపడ్డాడు. ఒక్కసారిగా వారి ముందుకు వచ్చిన పిగ్మీ మానవుడు.. ఆ తరువాత వారు కిందపడటం చూసిచూడగానే వెనుకగా మరికొన్ని వాహనాలను గమనించి పరుగెత్తాడు. రైడర్లలో ఒకరు బైక్‌పై అతడిని వెంబడించాడు. ఆ పిగ్మీ మానవుడు మట్టిరోడ్డుపై పరిగెత్తుతూ పొదల్లోకి వెళ్లిపోయాడు.

అయినా వదలని రైడర్లు అన్వేషించారు. కాగా పొదలు ఎత్తుగా ఉండడంతో అతడు ఎటువైపు వెళ్లాడో కనుగొనలేకపోయారు. అయితే వారికి పొదల్లో పిగ్మీ మానవుడి వినియోగించి కర్ర మాత్రమే దొరికింది. ఈ పిగ్మీ మానవుల గురించి ఇండొనేషియా ప్రాచీన సాహిత్యంలో కూడా పేర్కోనబడివుంది. వీరిని ‘మాంటే’ తెగగా అందులో పేర్కొన్నారు. వీళ్లు అడవుల్లోనే రహస్యంగా ఉంటారని, సాధారణ మనుషులను చూస్తే పారిపోతారని ఉంది. వీరి గురించి చరిత్రలో చాలా తక్కువ సమాచారం ఉంది. 17వ శతాబ్దంలో ఇద్దరు మాంటే తెగ మావులను పట్టుకొని అప్పటి సుల్తాన్‌కు కొందరు బహుమతిగా ఇచ్చారని చరిత్రలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వీరిని హబ్బిట్స్ అని కూడా పిలుస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pygmy man  tribe of indonesia  bike racers  banda aceh  sumatra islands  caught on camera  viral  

Other Articles

Today on Telugu Wishesh