షాకింగ్ కామెంట్లు.. ఆ సమయంలో గుళ్లోకి మహిళలు ఎందుకు? | Menstruating women must not enter places of worship.

Kerala congress leader says women should not enter holy places during their periods

Kerala Congress, Congress Interim President, MM Hassan Comments, Congress President Controversy, Kerala Congress Chief Comments, Menstruating Women Comments, Kerala Congress Controversy

Kerala Congress interim president MM Hassan says women on their period are impure, shouldn't enter places of worship.

మహిళలు అసలు గుడిలోకి ఎందుకు?

Posted: 03/28/2017 06:09 PM IST
Kerala congress leader says women should not enter holy places during their periods

మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం, ఆపై విమర్శలను ఎంజాయ్ చేయటం ఇప్పటి నేతలకు పరిపాటిగా మారిపోయింది. తాజాగా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్(తాత్కాలికం) ఎంఎం హసన్ దిగ్భ్రాంతికి గురిచేసేలా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. మహిళలు అసలు గుళ్లోకి వెళ్లాల్సిన పని ఏంటని ప్రశ్నిస్తున్న ఆ క్రమంలో నోరు జారాడు.

మహిళలు రుతుస్రావం సమయంలో మలినం అవుతారు. వాళ్లు గుళ్లోకి వెళ్లటం మంచిది కాదు. అందుకే గుళ్లోకి వెళ్లకుండా వారిని అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చాడు. పైగా అది సైంటిఫిక్ రీజన్ తో కూడుకుంది. కాబట్టి నా వ్యాఖ్యలను తప్పుగా చూడకండి అంటూ చెప్పుకొచ్చాడు. మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది అంటూ చివర్లో సలహా ఇచ్చాడు.

దీనిపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. నోటికి ఏదోస్తే అది మాట్లాడటమేనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పటికే నిషేధం ఉన్న గుళ్లలోకి వెళ్తామంటూ ప్రకటించిన కొన్ని సంఘాలు ఆయన ఇంటి ముందు బైఠాయించాయి కూడా. కాగా, సుధీరన్ రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పోస్టును మాజీ సీఎం ఉమెన్ చాందీ పట్టుబట్టి మరీ హసన్ కు కట్టబెట్టాడు. అయితే పదవి బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Congress Interim President  

Other Articles