విదేశీయులపై దాడి: వేగవంతమైన చర్యలు.. నిష్పక్షపాత దర్యాప్తుకు సీఎం అదేశం Africans beaten up in Greater Noida after drug death

Yogi adityanath promises thorough probe and quick action

mob attack, Nigerians, Sushma Swaraj, Greater Noida, Nigeria, Greater Noida, CLASH OF CULTURE, African countries, Yogi Adityanath, Nigerians Beaten In Greater Noida, Africans Beaten In Greater Noida, Drug Overdose, Greater Noida Protest, UP Government Report on Africans Attacked, UP Government Report on Nigerians Attacked, UP Police, Manish Khari, uttar pradesh

Uttar Pradesh Chief Minister Yogi Adityanath has promised a "fair and impartial" investigation into a mob attack on several African students in Greater Noida,

ITEMVIDEOS: విదేశీయుల రక్షణకు చర్యలు.. నిష్పక్షపాత దర్యాప్తుకు సీఎం అదేశం

Posted: 03/28/2017 01:39 PM IST
Yogi adityanath promises thorough probe and quick action

దేశానికి ఉన్నత విద్యాబ్యాసం కోసం వచ్చిన అఫ్రికా దేశాలకు చెందిన నైజీరియన్ విద్యార్థులపై స్థానికులు దాడి చేసిన ఘటనలో నిష్పక్షపాత. వేగవంతమైన విచారణ చేస్తామని ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ హామి ఇచ్చారు. నైజీరియన్లపై దాడులు జరగడానికి డ్రగ్స్ విక్రయం చేస్తున్నారన్న అభియోగాలను స్థానికులు మోపిన నేపథ్యంలో ఈ విషయంలో లోతైన విచారణ జరిపి నిజానిజాలను బాహ్యసమాజానికి తెలియజేస్తామని చెప్పారు.

గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ స్థానిక విద్యార్థి అత్యంత అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్ల మరణించాడన్న వార్తలతో మృతుడి బంధువులతో పాటు స్థానికులు నైజీరియన్ విద్యార్థులపై దాడులకు దిగారు. స్థానికంగా వుండే నైజీరియన్లు ఈ వార్త తెలిసి పరగు లఖించుకోగా, ముగ్గురు విద్యార్థులు మాత్రం అందోళనకారులకు చిక్కారు. దీంతో వారిపై స్థానికలు కర్రలు, ఇనుపరాడ్లు తదితదరాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు స్థానికంగా వున్న సీసీ టీవీ ఫూటేజీలలో చిక్కడంతో ఈ వార్త కాస్తా వైరల్ గా మారింది.

అయితే ఒక బాధిత నైజిరియన్ విద్యార్థి సాధిక్ బెల్లో.. తమపై అకారణంగా స్థానికులు దాడులు చేస్తున్నారని, ఈ క్రమంలో స్థానికుల నుంచి తమ ప్రాణాలకు తీవ్ర ముఫ్పు పొంచివుందని పేర్కోంటూ ఏకంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా తన బాధను, అవేదనను వెల్లబోసుకున్నాడు. దీనిపై వెనువెంటనే స్పందించిన సుష్మాస్వరాజ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాత్ తో ఫోన్ పై చర్చించారు. విదేశీ యువకులపై దాడిలో నిష్పక్షపాత విచారణ, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అమె చెప్పారు.

సుష్మ అదేశాలతో యోగీ అదిత్యనాథ్ పోలీసుల ఉన్నతాధికారులకు తక్షణం ఈ కేసు విచారణ చేయాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అదేశించారు. ఆ తరువాత ఈ కేసులో నేరస్థులందరిపైనా  వేగవంతమైన చర్యలు తీసుకుంటామన్నారు. విదేశీ విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles