దేశాధ్యక్ష పదవి రేసులో మోహన్ భగవత్..! Shiv Sena wants RSS chief Mohan Bhagwat as next President

Shiv sena wants rss chief mohan bhagwat as next president

Rashtriya Swayamsewak Sangh, RSS chief Mohan Bhagwat, Mohan Bhagwat, RSS chief Mohan Bhagwat as President, Shiv Sena, Sanjay Raut, BJP, Presidential Elections 2017, Advani, President post, Hindu Rashtra India

BJP ally Shiv Sena had proposed RSS chief Mohan Bhagwat's name for the post of President, who should be considered for the country's highest constitutional job

దేశాధ్యక్ష పదవి రేసులో మోహన్ భగవత్..!

Posted: 03/28/2017 12:50 PM IST
Shiv sena wants rss chief mohan bhagwat as next president

దేశాధ్యక్ష పదవి అంటే తెలుసా..? రాష్ట్రప‌తి పదవి. ఈ పదవిలో కొనసాగుతున్న ప్రణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వి రమారామి మరో ఏడాదిలో కాలంలో ముగియనుండడంతో.. ఈ పదవికి అప్పుడే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. మరో ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం దూరంగా వున్న రాష్ట్రపతి ఎన్నికలకు అప్పుడే అభ్యర్థులను ఖరారు చేయాలని, వారిని తెరముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి పదవి కోసం బీజేపి అగ్రగన్యుడు లాల్ కిషన్ అద్వానీ ఎంతో అశగా ఎదురుచూస్తున్నారని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపి మిత్రపక్షం శివసేన మాత్రం మరో అభ్యర్థిని తెరమీదకు తీసుకువచ్చింది.

రాష్ట్రపతి పదవికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆరెస్సెస్) చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కూడా తెరపైకి వచ్చింది. ఆయనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టాలని శివసేన పార్టీ కొత్త ప్రతిపాదనను అప్పుడే తెరపైకి తీసుకువచ్చింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్‌కు ప్రెసిడెంట్ ప‌ద‌వి క‌ట్టబెట్టాల‌ని శివసేన అభిప్రాయ‌ప‌డి కొత్త చర్చను తెరపైకి తీసుకువచ్చింది. హిందుత్వ నేత‌గా, ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా మోహన్ భ‌గ‌వ‌త్‌కు దేశ ప్రజల్లో మంచి పేరుందని అందుకనే అయన పేరును రాష్ట్రపతి పదవికి గుర్తించాలని ఈ ప్రతిపాదనను శివసేన తీసుకువచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

ఈ మేరకు తాము ఈ ప్రతిపాదనను ప్రధాని నరేంద్రమోడీ ముందుపెట్టదలిచామన్నారు. ఒకనాటి హిందుస్తాన్ గా వున్న భారత్ మళ్లీ అదిశగా పురోమించాలన్నా.. దేశంలో హిందుత్వ రాజ్య స్థాప‌న జ‌ర‌గాలన్నా భగవత్ రాష్ట్రపతి పదవిని అలకంరించాలని అశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామ్నా ప‌త్రిక‌లో ఆయ‌న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అది అత్యున్నత ప‌ద‌విని ఎటువంటి మ‌చ్చలేని వ్యక్తి అధిరోహించాల‌ని అందుకే తాము ఈ పేరును ప్రతిపాదించామన్నారు. భ‌గ‌వ‌త్‌ను రాష్ట్రప‌తి హోదాకు రిక‌మండ్ చేసే అంశాన్ని ఉద్దవ్ థాక్రే చూసుకుంటార‌ని రౌత్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Bhagwat  RSS  Shiv Sena  sanjay raut  BJP  Advani  President post  

Other Articles

Today on Telugu Wishesh