కళ్యాణం చేసుకున్న వరుడు.. శోభనం వద్దన్నాడు....! Woman files dowry complaint agianst in husband

Techies wife files complaint against him for avoiding first night

dowry harassement, mahesh, software engineer, mahaganapathi nagar, basaveshwara nagar, bengaluru, newly wed wife mahesh, in laws, physical contact, police. councelling, family disputes

A 24-year-old woman has lodged a police complaint against her husband and in-laws claiming that she is being harassed for dowry.

లెక్క కుదిరేవరకు.. శోభనం వద్దన్న టెక్కీ వరుడు..!

Posted: 03/28/2017 04:03 PM IST
Techies wife files complaint against him for avoiding first night

పెళ్లంటే నూరేళ్ల పంట. మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఆరంభమయ్యే అనుబంధం. ఆరంభంలో అభిప్రాయభేధాలు వచ్చినా అలా అలా పెనవేసుకుపోయి.. చివరకు గొప్ప అనుభంధాలను అనుభూతులను మిగిల్చే నూరేళ్ల వసంతాల పండుగగా మారిపోతుంది. అది మన వివాహబంధంలోని గొప్పదనం. ఎన్ని కష్టాలు వచ్చినా కడదాకా కలసి ఉండడం, ఒకరికోసం మరోకరు ఎంతో శ్రమకోరూస్తూ, సంతోషం, ధు:ఖంలోనే ఒకరికొకరు తోడుగా వుండటమే వైవాహిక బంధం.

అయితే చదువులేని నిరక్షరాస్యులు కూడా చేయని విధంగా వ్యవహరించిన సాప్ట్ వేర్ ఇంజనీరు మాత్రం అత్యంత దారుణంగా వ్వవహరించి వార్తల్లో నిలిచాడు. పెళ్లి చేసుకోగానే తనకు రావాల్సిన వరకట్నం ఇంకా చేతిలో పడలేదని, కట్నకానుకల లెక్కకుదిరితేనే శోభన ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటామని చెప్పి వార్తల్లో నిలిచాడు. ఇలా పెళ్లైందో లేదో.. అలా తన అర్థాంగి వదిలి తన తల్లిదండ్రులతో కలసి తన నివాసానికి చేరుకున్నాడు.వరకట్నం బకాయి చెల్లించేవరకు తొలిరాత్రికి ససేమిరా అన్నాడు.

గత ఏడాది మే నెలలో బసవేశ్వరనగర్‌ గణపతి లే అవుట్‌కు చెందిన మహేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో ఓ బెంగళూరుకు చెందిన ఓ స్థానిక యువతికి వివాహం జరిగింది. అయితే కట్నం డబ్బు చేతిలో పడేదాక శోభనాన్ని కూడా వాయిదా వేసుకుంటామని మహేష్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా వధువు తల్లిదండ్రులకు తేల్చిచెప్పారు. వధువు తల్లిదండ్రులు నగదు సమకూర్చలేకపోవడంతో అమె అమ్మగారింటికే పరిమితమైంది. పెళ్లైన కూతురు ఏడాది కాలం కావస్తున్న ఇంకా ఇంట్లోనే వుండటంతో ఇరుగుపోరుగు వారు కూడా అనేక అవమానాల పాటు చేశారు.

ఇది చాలదన్నట్లు తన భర్త మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని తెలుసుకున్న వదువు.. సరాసరి అత్తగారింట కాలుమేపింది. అయితే అమె భర్తతో పాటు అత్తామామలు అమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బలవంతం చేయడంతో అమె చేసేది లేక స్థానిక బసవేశ్వర నగర్ పోలీసులను ఆశ్రయించింది. అత్తామామాలు శకుంతల, శివనారాయణతో పాటు తన భర్తపై కూడా పిర్యాదు చేసింది. అయితే వారిని స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు ముందుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కట్నం కోసం కటకటాలు కావాలా..? లేక కొడలితో సఖ్యతగా వుంటూ మనవడు, మనవరాలితో కూడిన సంతోషం కావాలా అని అడుగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles