పవన్ ను ప్రశంసలతో ముంచిన రవిప్రకాష్, త్రివిక్రమ్.. ravi prakash and trivikram lauds pawan kalyan at katamarayudu funtion

Ravi prakash and trivikram lauds pawan kalyan at katamarayudu funtion

katama rayudu pre-release function, katama rayudu theatrical trailer launch, katamarayudu, pawan kalyan, katama rayudu, chiranjeevi, trivikram srinivas, ravi prakash, tollywood

tv 9 ceo ravi prakash and director trivikram srinivas lauds pawan kalyan at katamarayudu pre release function

పవన్ ను ప్రశంసలతో ముంచిన రవిప్రకాష్, త్రివిక్రమ్..

Posted: 03/18/2017 09:43 PM IST
Ravi prakash and trivikram lauds pawan kalyan at katamarayudu funtion

పవన్ కల్యాణ్ ఊరుకు పక్కనుండే మర్రి చెట్టులాంటివాడని అంటానని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. 'ఎందుకంటే, ఊరవతల ఏపుగా పెరిగిన మర్రిచెట్టు ఎండనుంచి, వర్షం నుంచి కాపాడుతుంది.. కనీసం గుర్తింపు కూడా కోరుకోదు.. అదే పవన్ కల్యాణ్' అంటూ త్రివిక్రమ్ విడమరచి చెప్పారు. జనమంతా ఒకడెవడో వస్తాడు అంటూ... అంతా వాడికోసం ఎదురు చూస్తారు...అలా ఎవరైనా తన గురించి మాట్లాడినప్పుడు బాధనిపిస్తుందని... అలా ప్రజల బాధలు తీర్చగలిగే స్థాయి కల్పిస్తే కనుక అంతకంటే ఇంకేమీ వద్దని పవన్ కల్యాణ్ తనతో చాలా సార్లు అన్నారని చెప్పారు.

పవన్ కల్యాణ్ చేసిన మంచిపనులకు తాను ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు.  ఒకడు చెయ్యెత్తితే జనం అంతా ఆగిపోయే శక్తి దేవుడు ఒక్కడికే ఇస్తాడు, అలాంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో అందరికీ తెలుసని అన్నారు.  అంతా కలిపి ఇంతే కావచ్చు... కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశం జెండాకున్న పొగరంత... ఆయన గొంతెత్తితే కొన్ని కోట్ల గొంతుల శబ్దం.. ఆయన సాయం కొన్ని కోట్ల చేతుల సాయం... ఆయన సేవ, మంచితనం ఇలాగే మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.  

పవన్ కల్యాణ్ ను బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లా మరొక వ్యక్తి ఎవరైనా కీలక పాత్ర పోషించి ఉంటే... ఫలితాల అనంతరం దానిని మరొక సంపాదనకు అవకాశంగా తీసుకునే వారన్నారు. అయితే పవన్ మాత్రం ఏపీ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి, విమర్శలు ఎదురవుతున్నా ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశంసించారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు పవన్ కల్యాణ్ నాంది పలికారని ఆయన చెప్పారు.

నిజం మాట్లాడడం, సత్యం వెనుక నిలబడడం చాలా కష్టమైన విషయమని చెప్పారు. రాష్ట్ర భవిత్యత్ దృష్ట్యా ఏపీకి ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి విషయాలపై నిర్భయంగా స్పందించడం ఎవరికైనా ఆదర్శనీయమని అన్నారు. యువత ఆయనలా నిజమైన సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందొక మాట, తరువాత ఒకమాట మాట్లాడే ఈ పరిస్థితి మారాలంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించిన విధానం బాగుందని రవిప్రకాష్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  katama rayudu  chiranjeevi  trivikram srinivas  ravi prakash  tollywood  

Other Articles