ఐపీఎస్.. ఎంపీల మధ్య పేస్ బుక్ వార్.. facebook war between ias roopa and mp pratap sinha

Facebook war between ias roopa and mp pratap sinha

roopa moudgil, roopa moudgil facebook, roopa moudgil facebook post, facebook post roops moudgil, roops moudgil ips, karnataka ips, Madhukar Shetty, Sonia Singh, mysore

twitter war broke out between ias roopa and mp pratap sinha over transfer of ias oficers in karnataka

ఫేస్ బుక్ నిర్వాకం.. రాజకీయ నేతలకు వత్తాసు

Posted: 03/18/2017 06:40 PM IST
Facebook war between ias roopa and mp pratap sinha

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ ఏం చేసిందో తెలుసా..? ఐపీఎస్ అధికారి అకౌంట్ ను రద్దు చేసింది. రాజకీయ నేతలు తమను రాజకీయాల్లోకి లాగొద్దని హితువు పలకడమే అమె చేసిన నేరంగా పరిగణించిన ఫేస్ బుక్ ఈ చర్యలకు పాల్పడింది. అయితే ఆ హితవు పలికింది ఎవరో సామాన్యులతో కాదు.. ఏకంగా ఓ పార్లమెంటు సభ్యుడితో.. అందులోనూ అధికారంలో వున్న పార్టీకి చెందిన ఎంపీతో. అంతే ఇలా సూచించిన 24 గంటల వ్యవధిలోనే అమె అకౌంట్ రద్దు చేసింది ఫేస్ బుక్.

కర్ణాటక రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులు మధుకర్‌శెట్టి, కౌశలేంద్రకుమార్, లాభూరామ్, సోనియాసింగ్‌లను ఇటీవల కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారులను ఉన్నత పదవులతో గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుడంటంతోనే ఐపీఎస్‌ అధికారులు కేంద్రానికి బదిలీపై వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ ప్రతాపసింహ చేసిన ట్విట్టర్‌పై మహిళా ఐపీఎస్‌ అధికారి రూప అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులను రాజకీయ వివాదాల్లోకి రావద్దంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రతీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారికి కేంద్రంలో పని చేయాలనే ఉంటుందంటూ తెలిపిన ఆమె దీనికి రాజకీయ ప్రతినిధులు రాజకీయ రంగు పులమరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల ద్వారా పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా పాలన వ్యవస్థ గాడి తప్పుతుందంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రతాపసింహ తాను కేవలం మాధ్యమాల్లో ప్రచురితమైన వార్తలను మాత్రమే షేర్‌ చేసానని, మీకు వీలైనపుడు ట్వీట్లను మరోసారి పునఃపరిశీలించాలంటూ సూచించారు. దీనిపై మహిళా ఐపీఎస్‌ అధికారి రూప రాజకీయ నాయకులుగా మీపని మీరు చేసుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులను వారి పని చేసుకోనివ్వాలంటూ పరోక్షంగా హితవు పలికి ట్విట్టర్‌లో మాటల యుద్ధానికి తెరదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roopa moudgil  pratap sinha  BJP MP  IPS  facebook  account removed  karnataka  

Other Articles