ఎప్పటికీ నా హీరో చిరంజీవే: పవన్ కల్యాన్ my hero is chiranjeevi says pawan kalyan

My hero is chiranjeevi says pawan kalyan

katama rayudu pre-release function, katama rayudu theatrical trailer launch, katamarayudu, pawan kalyan, katama rayudu, chiranjeevi, trivikram srinivas, ravi prakash, tollywood

my all time hero is megastar chiranjeevi says power star pawan kalyan at katama rayudu pre release funtion held at shilpakala vedika

ఎప్పటికీ నా హీరో చిరంజీవే: పవన్ కల్యాన్

Posted: 03/18/2017 10:23 PM IST
My hero is chiranjeevi says pawan kalyan

ఎప్పటికీ తన హీరో మెగా స్టార్ చిరంజీవేనని తాను హీరో కాదని అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాన్. తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని.. టెక్నీషియన్ అవుదామని భావించినా.. హీరోను అయ్యానన్నారు. ఇన్నాళ్లు చిత్రసీమలో ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేశానని, భవిష్యత్ లో కూడా తనకు ఎలాంటి భాధ్యతలు అప్పగించినా వాటిని చిత్తశుద్దితో చేస్తానన్నారు. తన దృష్టిలో నిజాయితీతో చిత్తశుద్దితో చేసే అన్ని పనులను గౌరవమర్యాదలు వున్నవేనన్నారు. తాను జీవితంలో నేర్చుకున్న చాలా అంశాలు సినిమాల్లో వచ్చాయని ఆయన చెప్పారు.

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ.. తాను గతంలో నటించిన సినిమాలతో తనకున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. త్రివిక్రమ్ తనకు 'గోకులంలో సీత' సినిమా నుంచి తెలుసని అన్నారు. ఆ సినిమాలో ప్రేమ సర్వం, ప్రేమే అన్నింటికి మూలం అన్నది తెలుసుకున్నాన్నారు. ఆ డైలాగ్ త్రివిక్రమ్ రాశారని చెప్పారు. అలాగే 'సుస్వాగతం'లో తండ్రి మరణిస్తే తిరిగే కుర్రాడిపాత్రలో చాలా ఏడ్చానని.. తన జీవితంలో చాలా కదిలించిన సన్నివేశాలు సినిమాల్లో ఉన్నాయని చెప్పారు. 'తొలి ప్రేమ' సమయంలో బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనిపించేదని అన్నారు. తనలో భావాలను సినిమా రూపంలో చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

'తమ్ముడు' సినిమాకి ప్రాణాలు ఫణంగా పెట్టేశానని ఆయన చెప్పారు. నువ్వు చేయ్యలేవని చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నించడమే తమ్ముడు సినిమా అని, అందుకే దానికి ట్రావెలింగ్ సోల్జర్ అని ట్యాగ్ లైన్ పెట్టానని ఆయన అన్నాడు. 'బద్రి'లో నువ్వు నందా అయితే ఏంటి? అన్న ప్రశ్న తన జీవితమని అన్నారు. నీ ఎక్కువ ఏంటి? నువ్వు కూడా మనిషివే అని గుర్తు చేయడమని పవన్ తెలిపారు. 'ఖుషీ' సినిమాలో నా దేశాన్ని ప్రేమించడం తనకు చాలా ఇష్టమని చెప్పదానికే ఏ మేరా జహా పాటను పెట్టానని పవన్ చెప్పారు. ఖుషీ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కీడు శంకించిన తనకు, గబ్బర్ సింగ్ సినిమాతో కోలుకున్నానని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  katama rayudu  chiranjeevi  trivikram srinivas  ravi prakash  tollywood  

Other Articles