అగ్రరాజ్యంలో మరో జాత్యాంహకార దాడి.. మహిళ అని తెలిసికూడా..! Man faces hate crime charges after assaulting Muslim Delta employee

Man charged with kicking yelling racist comments at muslim delta employee at jfk

delta airlines, robin rhodes, racial attack, racist tirade, Muslim Delta Employee, John F. Kennedy Airport, unlawful imprisonment, Richard Brown, america

A traveler Robin Rhodes, 57, is accused of going on a racist tirade at John F. Kennedy Airport, yelling threatening slurs and kicking a Muslim Delta employee in the leg.

అగ్రరాజ్యంలో మరో జాత్యాంహకార దాడి.. మహిళ అని తెలిసికూడా...

Posted: 03/17/2017 08:03 PM IST
Man charged with kicking yelling racist comments at muslim delta employee at jfk

అగ్రరాజ్యం అమెరికాలో మరో జాత్యాంహకార దాడి జరిగింది. ఓ ముస్లిం మహిళా ఉద్యోగిపై ఓ అమెరికన్ చేయిచేసుకున్న ఘ‌ట‌న అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికాలో విదేశీయుల‌పై దాడులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న మ‌రోసారి ఆందోళ‌న రేపింది. రోబిన్‌ రోడ్స్‌(57) అనే అమెరికన్ ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. తాజాగా మసాచూసెట్స్‌ వెళ్లడానికి కనెక్టింగ్‌ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లి అక్కడి ముస్లిం మ‌హిళా ఉద్యోగిని చూశాడు. ఆమెను చూడ‌గానే అత‌డిలోని ద్వేషం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె ఏ త‌ప్పూ చేయ‌క‌పోయిన‌ప్పటికీ ఇక్కడ‌ నువ్వు నిద్రపోతున్నావా? లేక నమాజ్‌ చేస్తున్నావా? ఏం చేస్తున్నావ్‌? అంటూ అరిచాడు.

అనంత‌రం త‌న‌కు, ఆ ఉద్యోగినికి అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టి లోప‌లికి ప్రవేశించాడు. దీంతో ఆ ముస్లిం ఉద్యోగిని భయప‌డింది. తాను ఏం తప్పు చేశానని అడిగింది. అయితే అదేమీ పట్టించుకోకుండా 'నిన్ను వదలను' అంటూ అతను ఆమె వ‌ద్దకు దూసుకొచ్చాడు. దీంతో ఆ ఉద్యోగిని వెంటనే బయటకు పరుగులు తీసింది. అయినా వ‌ద‌ల‌ని రోడ్స్ ఆమెను వెంబడించి ప‌ట్టుకొని ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇస్లాం, ఐసిస్‌ అంటూ పెద్దగా అరిచాడు. త‌మ దేశంలో ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నాడంటూ నినాదాలు చేసి, ముస్లింలను ట్రంప్ త‌రిమేస్తాడ‌ని అన్నాడు. అత‌డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయ‌స్థానంలో హాజరుపరిచారు. అనంతరం 50 వేల డాలర్ల పూచీకత్తుతో ఆయ‌న‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ చ‌ర్య‌కు గానూ రోడ్స్‌కు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles