పాకిస్థాన్ ప్రధాని సాక్షిగా గాయత్రీ మంత్ర పఠనం Girl sings Gayatri Mantra before PM Nawaz Sharif

Gayatri mantra chants infront of pakistan pm nawaz sharif

Gayatri Mantram In Pakisthan, Gayatri Mantra Chanted In Pak, gayatri mantra, mantra chants, pak pm, nawaz sharif, hindus in pakistan, holi celebration in pak

An incident which an Indian cannot imagine happened in Pakistan. According to reports Singer Naroda Malini chanted Gayatri Mantra was chanted in Pakistan on the eve of Holi and the wonder is enchanting the mantra happened before Prime Minister of Pakistan Nawaz Shariff.

ITEMVIDEOS: పాకిస్థాన్ ప్రధాని సాక్షిగా గాయత్రీ మంత్ర పఠనం

Posted: 03/17/2017 07:29 PM IST
Gayatri mantra chants infront of pakistan pm nawaz sharif

అనునిత్యం భారత్ అన్నా.. భారతీయులన్నా.. వారి సంస్కృతీ సంప్రదాయాలన్న.. విముఖత వ్యక్తం చేసే పాకిస్తాన్ లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే ఏకంగా పాకిస్థాన్ లో ఓ హైందవ ఓ యువతి.. గాయత్రి మంత్రాన్ని పఠించింది. ఇందులో ఏముందీ అంటారా..? అమె పఠించింది తన ఇంట్లో కాదు.. సాక్షాత్తు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ముందు. ఔనా..? అంటున్నారు కదూ.. అయితే యువతి పఠించిన గాయత్రి మంత్రానికి ఆలకించిన నవాజ్ షరీఫ్ ముగ్ధుడై చప్పట్లను కూడా కొట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ లోని హిందువులు ఇటీవల హోలి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రధాని నవాజ్ సహా పలువురు ప్రభుత్వ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని వల్లె వేసింది. ప్రధాని నవాజ్ తో పాటు వేదికపై ఉన్న ప్రతిఒక్కరూ శ్రద్ధగా గాయత్రి మంత్రాన్ని విన్నారు. అనంతరం, బాలికను చప్పట్లతో అభినందించారు. అంతకుముందు, నవాజ్ మాట్లాడుతూ, పాక్ లోని మైనార్టీలు అయిన హిందువులకు అన్ని రకాల రక్షణను కల్పిస్తామని, వారి హక్కులను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles