అమ్మ స్థానంలో బీజేపీ అభ్యర్థి... ఎవరో తెలుసా? | BJP nominates Gangai Amaran for RK Nagar Byelection.

Gangai amaran joins the rk nagar race

Music Director Gangai Amaran, RK Nagar bypoll, Gangai Amran, Ilayaraja Brother Gangai Amran, BJP Gangai Amran, RK Nagar BJP Gangai Amran, Gangai Amran Nomination, Deepa Jayakumar Panneerselvam, RK Nagar By Election Panneerselvam, BJP Candidate

BJP names veteran music director Gangai Amaran for RK Nagar bypoll. Gangai Amran, brother of music mastero Illayaraja, had joined the BJP in 2014.

ఆర్కే నగర్ బరిలో మ్యూజిక్ డైరక్టర్

Posted: 03/18/2017 07:55 AM IST
Gangai amaran joins the rk nagar race

జయలలిత అసలు వారసులు ఎవరో తెల్చే ఆర్కే నగర్ ఉప ఎన్నికపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కాస్త కూస్తో జనాల మద్ధతును కూడగట్టుకున్న మేనకోడలు దీపా జయకుమార్ పోటీ నేపథ్యంలో ఎవరూ తగ్గకుండా అంతా తమ అభ్యర్థులను నిలబెట్టకోవటం తెలిసిందే. అక్కడ అధికారానికి చాలా కాలమే దూరమైన ప్రతిపక్ష డీఎంకే సహా విజయ్ కాంత్ డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు, తిరుగుబాటు పన్నీర్ సెల్వం, అధికార అన్నాడీఎంకే ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

ఇక ఇప్పుడు ఈ స్థానంపై భారతీయ జనతా పార్టీ కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గేయ రచయిత అయిన గంగాయ్ అమరన్‌ను బరిలో నిలిపింది. తొలుత తమిళ్ సాయి సౌందరాజన్ ను నిలపాలని భావించినప్పటికీ, సీనియర్ల సలహా మేరకు చివరకు అమరన్ కే అవకాశం ఇచ్చింది. తొలుత నటి గౌతమి పేరు వినిపించినప్పటికీ, తర్వాత ఆ వార్తలను ఆమె స్వయంగా ఖండించింది కూడా. కాగా, గంగాయ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి సోదరుడు కూడా. పలు చిత్రాలకు స్ర్కిప్ట్ లు రాయటమే కాదు, దర్శకత్వం కూడా వహించాడు. 2014 లో బీజేపీలో చేరిన ఆయనకు స్టేట్ కల్చరల్ యూనిట్ విభాగానికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పించి పార్టీ.

ఇక ఈ ఉపఎన్నికలో అన్నాడీఎంకే నుంచి శశికళ బంధువు దినకరన్ పోటీ చేస్తుండగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటి దాకా అభ్యర్థిని ప్రకటించకపోగా, దీపకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే జాతీయ పార్టీలు తమిళ రాజకీయాల్లో తిష్ట వేయాలని భావిస్తే ద్రవిడ పార్టీల దెబ్బ చవిచూడాల్సి వస్తుందని కామెంట్లు చేయటం చూశాం కదా. ఈ నేపథ్యంలో బీజేపీ పోటీ మరింత వేడిని రాజేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK Nagar  Byelection  BJP Candidate  Music Director Gangai Amran  

Other Articles