‘‘మా రైతుల రుణాలనూ మాఫీ చేయండీ.. ఉత్తర దక్షిణాల వివక్ష ఎందుకు..?’’ pawan kalyan demands extension of crop loan waiver even to telugu states

Pawan kalyan demands extension of crop loan waiver even to telugu states

janasena, pawan kalyan, power star, central government, radha mohan singh, union minister, farmer, loan waiver, crop loan waiver, north India, south India, Integrity

Janasena President Power Star Pawan Kalayan questioned Central government on differences between north and south india, demands extension of farmers crop loan waiver to telugu states.

‘‘మా రైతుల రుణాలనూ మాఫీ చేయండీ.. ఉత్తర దక్షిణాల వివక్ష ఎందుకు..?’’

Posted: 03/17/2017 06:12 PM IST
Pawan kalyan demands extension of crop loan waiver even to telugu states

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు జనసేన అధినేత పవన్ కల్యాన్. గత ఎన్నికలలో నవ్యాంద్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించిన రెండేళ్ల తరువాత ప్రజల్లోకి వెళ్లి తన పార్టీ తరపున సభలు.. సమవేశాలను ఏర్పాటు చేస్తున్న పవన్ కల్యాన్.. తాజాగా కూడా కేంద్రంలోని బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశ్నలను సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది ప్రజలకు, దక్షిణాది ప్రజలకు మధ్య వత్యాసం తీసుకువచ్చేలా చేపడుతున్న చర్యలు సరికావని అన్నారు.

కేంద్రం ఇలాంటి చర్యల మూలంగా దేశ సమగ్రత దెబ్బతినే అవకాశం వుందని ఆయన తూర్పార బట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు రైతు రుణాలను మాఫీ చేయాలని కోరినా.. వాటిని కనీసం పరిగణలోకి తీసుకోని కేంద్రం.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం రైతు రుణాలను మాఫీ చేస్తుందని ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి ప్రకటించిన రుణమాఫీని కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కల్యాన్ తీవ్రంగా స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.

సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆయన బీజేపి, ఎన్డీఏ తీరును తప్పుబట్టారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని సూచించారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రైతులకు వర్తింపజేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రుణాలను మాఫీ చేయాలని, అక్కడ వర్తింపజేస్తున్నట్లుగానే తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ తీసుకువచ్చారు.

తెలుగు రాష్ట్రాలలోనూ అనేక మంది రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లించలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇప్పటికీ రుణాలను చెల్లించలేక అనేక మంది రైతులు అవస్థులు పడుతున్నారని.. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్రం రైతు రుణాల మాఫీని తెలుగురాష్టాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగు రాష్ట్రాలు రెండూ రైతు రుణమాఫీ కోసం కేంద్రం వద్దకు వెళ్తే నీతులు, కథలు, సూక్తులు చెప్పారని గుర్తు చేస్తూ...ఆ నీతులు, సూక్తులు, కథలు బీజేపీకి వర్తించవా? అని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  farmer  loan waiver  crop loan waiver  north India  south India  national Integrity  

Other Articles