ఆమెను మరీ అంత వరస్ట్ గా ఓడిపోవటానికి కారణాలు తెలుసా? | Irom Sharmila Lost So Badly In Her Maiden Election.

Political analysis on anairom sharmila lost

Irom Sharmila, Manipur Iron Lady, Irom Sharmila Lost, Irom Sharmila Quit Politics, Manipur Elections, Irom Sharmila Wrong Decisions, Irom Sharmila 90 Votes

Manipur Iron Lady Irom Sharmila Lost So Badly In Her Maiden Election Contest In Manipur. Analysts says some reasons.

షర్మిల దారుణ ఓటమికి పోస్ట్ మార్టం

Posted: 03/13/2017 09:23 AM IST
Political analysis on anairom sharmila lost

మానవ హక్కుల కోసం ఏడతెరపని 16 ఏళ్ల పోరాటం చేసిన మణిపూర్ ఉక్కు మహిళ రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ నిర్ణయం ప్రకటించగానే అంతర్జాతీయ మీడియాతో సహా అంతా ఓవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ఆహ్వానం కూడా పలికారు. 44 ఏళ్ల ఇరోమ్ షర్మిలా సాహసోపేతంగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఓక్ రాం ఇబోబి పైనే పోటీకి దిగి పెద్ద షాకే ఇచ్చింది. అయినప్పటికీ ఆమె తన ఛరిష్మాతో గెలవటం ఖాయమనే అంతా భావించారు. కానీ, విధి చాలా బలీయమైంది. అందుకే జస్ట్ 90 ఓట్లతో ఆమెకు రివర్స్ లో ఎవరూ ఊహించని పెద్ద షాకే ఇచ్చి ఏకంగా రాజకీయాల నుంచి దూరం చేసింది.

సొంత ప్రజల హక్కుల కోసం నిరాహార దీక్ష చేసిన ఆమెకు అదే ప్రజలు ఎందుకు పట్టం కట్టలేకపోయారు. నల్లేరు మీద నడకేనని భావించిన ఆమె గెలుపు కేవలం 0.33 శాతం ఓట్లతో అత్యంత దయనీయంగా, అది దారుణంగా ఎందుకు ఓడిపోయింది. ఈ కారణాలను విశ్లేషిస్తే చాలా విషయాలే వెలుగు చూస్తాయి. షర్మిల సంచలన నిర్ణయం

నిజానికి ఆమె తొలుత సొంత ఊరు ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించింది. తర్వాత సీఎం ఇబోబి నియోజకవర్గం అయిన థౌబాల్ నుంచి పోటీ అనగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, ప్రజలు మాత్రం జాతి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆమెను లైట్ తీస్కున్నారు. పైగా ఆమె పోరాటం చేసిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దును ఆమె సాధించలేకపోవటం, అభివృద్ధే ముఖ్యమని భావనలో ప్రజలు ఉండటం ఆమెను ఓడించాయి.

ఇక దీక్ష విరమించిన వెనువెంటనే ‘పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’ అనే పార్టీ స్థాపించటం కూడా ప్రజలకు అంతగా రుచించలేదు. మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు పూర్తిగా పురుషుల సొంతమనే భావన అక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. 268 మంది అభ్యర్థులు పోటీ పడితే వారిలో కేవలం పదిమంది మాత్రమే మహిళలు ఉండటమే దీనికి నిదర్శనం.

ఇలా ఎన్నికల్లో షర్మిల ఓటమికి పలు రకాల కారణాలు ఉన్నాయన్నది వారి వాదన. దీనికి తోడు అత్యంత శక్తిమంతుడైన ఇబోబి సింగ్‌పై పోటీకి దిగడం, 16 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవటం వల్లే షర్మిల ఓటమి పాలయ్యారని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur Elections  Iron Lady  Irom Sharmila  Lost  

Other Articles

Today on Telugu Wishesh