జాగ్రత్త... మోసాలెక్కువగా ఈ బ్యాంకుల్లోనే.. లిస్ట్ ఇదిగో... | RBI report on the most bank frauds.

Rbis bank fraud list features icici sbi at the top

Reserve Bank of India, Bank Frauds List, Finance Ministry, ICICI Bank Frauds, Top banks Fraud, Bank Fraud Cases, SBI Frauds, India Bank Frauds Amount

Top banks like ICICI, SBI, Standard Chartered have highest number of fraud cases, says RBI

అలర్ట్: మోసాల్లో ఆ టాప్ బ్యాంకులే తోపులు...

Posted: 03/13/2017 08:14 AM IST
Rbis bank fraud list features icici sbi at the top

దేశంలోని బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ తాజాగా ఓ నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించింది. అందులో మోసగాళ్లకు ఎక్కువ లక్ష్యంగా మారుతున్న బ్యాంకులేవో పేర్కొంది కూడా. ఆ జాబితాలో ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ మొదటి స్థానంలో ఉండటం విశేషం. రూ. లక్ష అంతకంటే ఎక్కువ విలువతో కూడిన మోసాలు ఐసీఐసీఐ బ్యాంకులో 455 చోటు చేసుకున్నాయి. అది చాలదన్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్ బీఐ రెండో స్థానంలో ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది.

ఇక ఎస్ బీఐలో ఈ సంఖ్య 429, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో 244, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 237 మోసాలు జరిగాయి. ఆర్ బీఐకి బ్యాంకులు అందజేసిన సమాచారం ప్రకారం యాక్సిస్ బ్యాంకులో 189, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 176, సిటీ బ్యాంకులో 150 మోసపూరిత ఘటనలు నమోదయ్యాయి. మోసాల కారణంగా నష్టపోయిన విలువ పరంగా చూస్తే ఎస్ బీఐ రూ.2,236 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.2,250 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.1998 కోట్ల చొప్పున లెక్క తేలింది.

ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్ బీఐ అందించింది. వీటిలో బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని తెలియచేసింది. ఎస్బీఐలో ఇలా మోసాల్లో పాలు పంచుకున్న ఉద్యోగుల సంఖ్య 64 కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 49 మంది, యాక్సిక్ బ్యాంకులో 35 మంది ఉన్నారు. మొత్తం వివిధ బ్యాంకుల తరఫున 450 మంది సిబ్బంది ఈ విధమైన మోసాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మోసాలకు సంబంధించి మొత్తం 3,870 కేసులు నమోదు కాగా, వాటి విలువ రూ.17,750 కోట్లు. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఆర్ బీఐ గణాంకాలు ఇలా ఉండగా, నోట్ల రద్దు తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ అంచనా వేస్తోంది. హ్యకర్లు సులువుగా రక్షణ చర్యలను బ్రేక్ చేయటం, ఖాతాదారులు కాస్త ఏమరపాటుగా ఉండటం, అన్నింటికన్నా ఉద్యోగుల చేతివాటం తదితర కారణాలను అందులో ఆర్బీఐ పేర్కొంది.. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Bank Frauds List  Finance Ministry  2016-17  

Other Articles