ఎన్నికల ఫలితాలపై ఉక్కు మహిళ సంచలన నిర్ణయం.. Irom Sharmila quits politics

Won t fight another poll says irom sharmila

manipur elections result, election results, irom sharmila, irom sharmila quits, irom sharmila quit politics, irom sharmila defeat, cm okram ibobi singh, okram ibobi singh wins against irom sharmila, ibobi-irom contest, thoubal constituency, peoples’ resurgence and justice alliance (prja)

The results at the Thoubal constituency, where Irom lost to CM Okram Ibobi Singh, is not a surprise to most. Singh has remained unbeaten there for three terms now.

ఎన్నికల ఫలితాలపై ఉక్కు మహిళ సంచలన నిర్ణయం..

Posted: 03/11/2017 06:02 PM IST
Won t fight another poll says irom sharmila

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన ఇరోం షర్మిల రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. నేడు వెల్లడించిన మణిపూర్ అసెంబ్లీ ఫలితాల అనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని నిరసిస్తూ ఆమె 16 ఏళ్లుగా నిరహార దీక్ష చేశారు. అయితే గతేడాదే ఆ దీక్షకు స్వస్తి చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏఎఫ్ఎస్పీఏను రద్దుచేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పదవికి ఆమె పోటీ చేశారు.
 
అయితే ఆమెను నివ్వెరపరుస్తూ కేవలం 90 ఓట్లే ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. దీంతో భారీగా దెబ్బతిన్న ఇరోం షర్మిల రాజకీయాల నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించారు. ప్రజలు తనను సపోర్టు చేయడం లేదని పేర్కొంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు కూడా పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. అవేమీ పట్టించుకోని ఇరోం షర్మిల రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి ఓంకార్ ఇబోబీ సింగ్  కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles