పంజాబ్ లో ఏకపక్ష విజయం దిశగా కాంగ్రెస్ Congress Takes Big Lead, in Punjab

Punjab election results 2017 congress takes big lead aap s hopes crushed

Punjab Assembly elections results, Punjab Assembly elections results leads, Punjab Assembly elections trends, Punjab elections, Punjab elections 2017, Punjab polls 2017, Punjab, Shiromani Akali dal, BJP, Congress, Aam Admi party, politics

Results in Punjab strongly indicate that the Aam Aadmi Party's hopes of seizing its second state after Delhi are done for. The Congress has taken a strong lead in the state. It is ahead in 65 seats.

పంజాబ్ లో ఏకపక్ష విజయం దిశగా కాంగ్రెస్

Posted: 03/11/2017 10:59 AM IST
Punjab election results 2017 congress takes big lead aap s hopes crushed

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఓటరు నాడి సుస్పష్టమైంది.  ముందునుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నట్లుగానే పంజాబ్ లో కాంగ్రెస్ హావా కొనసాగుతోంది. అధికార అకాళీదళ్, బీజేపి కూటమిని అక్కడి ఓటర్లు ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమితం చేశారు. దశాబ్ద కాలం తర్వాత పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్ గాలి వీస్తోంది. అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మొత్తం 117 స్థానాలకు గానూ  ఇప్పటికే అక్కడ ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలను దాటుకుని విజయం వైపునకు ప్రయాణిస్తోంది.

కాగా ఈసారి ఎలాగైనా తమ పొరుగు రాష్ట్రంలో పాగా వేయాలని భావించిన ఢిల్లీ అధికార పార్టీ ఆమాద్మీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అయితే పంజాబ్‌లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. కాగా కాంగ్రెస్ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ పార్టీ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ మాత్రం వెనుకబడ్డారు. ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌పై పోటీ చేసిన ఆయన ఓట్ల లెక్కింపు సందర్భంగా మధ్యలో పుంజుకుంటున్నట్టు కనిపించినప్పటికీ... బాదల్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది.

లుధియానాలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గట్టి బందోస్తు నడుమ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ దూసుకు పోతోంది. రెండోస్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌), అకాలీదళ్‌-బీజేపీ కూటమి పోటీ పడుతున్నాయి. బీజేపీ అబోహర్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 59 స్థానాలు అవసరం.

* అమృత్ సర్ ఈస్ట్‌: నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ ముందంజ
* పాటియాల: కెప్టెన్ అమరీందర్ సింగ్ కు 3500 ఓట్ల ఆధిక్యం
* బాట్లా: ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి గుర్ ప్రీత్ సింగ్
* అబోహర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సునీల్ జకహర్ వెనుకంజ

తొలి ఆధిక్యాలు
కాంగ్రెస్- 60
ఆప్- 25
అకాలీదళ్‌-బీజేపీ-29
ఇతరులు-1

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles