గోవాలలో కాంగ్రెస్ ముందంజ.. మణిపూర్ లో అధికారం నిలుపుకునే దిశగా Congress leads In Goa retain Manipur

Congress leads in goa retain power in manipur

Manipur Assembly elections results, Goa Assembly elections results leads, Goa, Manipur Assembly elections trends, Manipur elections, Goa elections 2017, Manipur polls 2017, Goa poll results, Goa, Manipur, BJP, Congress, AAP, politics

Big jolt for BJP as Goa Chief Minister Laxmikant Parsekar (BJP) trails Congress candidate Dayanand Sopte by 3,826 votes in Mandrem constituency where congress emerges as single largest party and in Manipur congress retains power.

గోవాలలో కాంగ్రెస్ ముందంజ.. మణిపూర్ లో అధికారం నిలుపుకునే దిశగా

Posted: 03/11/2017 11:43 AM IST
Congress leads in goa retain power in manipur

గోవాలో అధికార బీజేపికి ఎదురుగాలి వీస్తుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రచారం చేసినా.. అక్కడి ఓటర్లు ఆయననే విశ్వాసంలోకి తీసుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదిలి కేంద్రమంత్రిగా వెళ్లిన ఆయనను పరిగణలోకి తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసిన గోవా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్ల మొగ్గుచూపారు. ఏకంగా గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సీకర్ కూడా ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. లక్ష్మీకాంత్ పర్సేకర్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినా ఆయన మడ్రీడ్ నియోజకవర్గ ప్రజలు మాత్రం అతని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే గోవాలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించడం కాయంగా తెలుస్తుంది. అయితే మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 21కి చేరకుంటుందా..? లేదా అన్నది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 23 స్థానాల ఓట్ల సరళి అందుబాటులో వచ్చేసరికి కాంగ్రెస్ 13, బీజేపి 9, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో వున్నారు.

ఇక మణిపూర్ లో కాంగ్రెస్ మరోమారు అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా పయనిస్తుంది. తొలిసారి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో బీజేపి పోటీకి దిగి తమ ఉనికిని చాటుకుంది. అయితే గత మూడు పర్యాయాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ కు మాత్రం ప్రజాదరణ తగ్గలేదని మణిపూర్ ఓటర్లు స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ 23 స్థానాలతో ముందుండగా, బీజేపి 14 స్థానాలలో కొనసాగుతుంది. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో వున్నారు.

ముఖ్యమంత్రి  ఇబోబీ సింగ్‌ మరోమారు అఖండ విజయం. తన ప్రత్యర్థిపై సుమారు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఇక మణిపూర్ ఎన్నికల నుంచి తన పోరాటాన్ని మార్చుకుంటానని చెప్పి.. రాజకీయ పోరులో తొలిసారి నిలిచిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలకు ఓటమి తప్పలేదు. అమె పోరాటానికి స్థానిక ప్రజల మద్దతు కూడా లభించలేదు. అమెకు కేవలం పదుల సంఖ్యలోనే ఓట్ల నమోదయ్యాయి.  కాగా 2019లో మరోమారు పోటీ చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur  Goa  election results 2017  manipur elections 2017  Goa 2017  Congress  AAP  BJP  

Other Articles

Today on Telugu Wishesh