వోక్స్ వాగన్.. డ్రైవర్ రహిత కారు.. చేయక తప్పదు షికారు.. VW showcases self-driving 'Sedric'

Volkswagen s latest concept car is a self driving robot assistant

volkswagen, self driving van, sedric, electric platform, no pollution, driverless car, transportation, SAI, clusterstock, business

Volkswagen Group has unveiled a concept car that's more of a robot assistant than a vehicle. Called Sedric, the concept car is the very first built by Volkswagen Group,

వోక్స్ వాగన్.. డ్రైవర్ రహిత కారు.. చేయక తప్పదు షికారు..

Posted: 03/08/2017 07:28 PM IST
Volkswagen s latest concept car is a self driving robot assistant

రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే దుమ్ము, దూలి, కాలుష్యం కాటువేస్తుందన్న భయం వణికిస్తుంది. అయితే వీటి నుంచే కాకుండా ఎండ, వాన, చలి ఇత్యాది సమస్యలు ఎదురైనా ఎంచక్కా ప్రయాణం చేయాలంటే కారు మేలు అని అంటుంటారు. అయితే కారులో దూర ప్రయాణాలు చేయడమన్నా.. లేక ట్రాఫిక్ కారణంగానో దగ్గరి ప్రాంతాలకు వెళ్లాలన్నా అధిక సమయం పడుతుందన్న అలోచనతో చాలా మంది దానిని నడిపేందుకు కూడా ఇష్టపడరు. మరి బడికి పిల్లలను దింపాలన్నా.. లేక స్థానికంగా వుంటే దుకాణాలకు వెళ్లాలన్న ఎలా..? తల్లిదండ్రులను పనిపైన బయటికి తీసుకువెళ్లాలంటే.. పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి రావాలంటే.. ఎలా..? ఇప్పుడిక ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం లభిస్తుంది.

అదే సిడ్రిక్ కారు. ఔనండీ.. ఈ కారు వుంటే చాలు ఎవరెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిరావోచ్చు. జర్మనీ అటోమేకర్ కంపెని వోక్స్ వాగన్ కంపెనీ నుంచి వస్తున్న సరికొత్త డ్రైవర్ రహిత కారు ఇది. డ్రైవర్లు లేని కార్లు అనేకం రోడ్ల మీదకు వచ్చేస్తున్న తరుణంలో ఈ కారు కూడా అదే కోవలో రోడ్డుపైకి రానుంది. ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో డ్రైవర్ రహితంగా వెళ్తుందని, దీనికి ఎలాంటి మనవసాయం అవసరం కూడా లేదని వోక్స్ వాగన్ కంపెనీ అధికారులు చెప్పారు. స్టీరింగ్, డ్రైవర్‌ ఇద్దరూ అవసరం లేకపోతే ప్రయాణీకులు ఒక దిక్కుకు కాకుండా ఎదురుఎదురుగా కూర్చుని వెళ్లేలా ఉంటుంది ఇది.

అంతేకాదు.. ఈ కారులో వెళ్లేటప్పుడు స్వచ్ఛమైన గాలి అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. సెడ్రిక్‌ను కేక వేయడంతోనే అది ఎక్కడున్నా... సర్రు సర్రున మీ ముందుకు వచ్చేస్తుంది. ఆ తరువాత లోపల కూర్చున్న వెంటనే.. ‘ఆఫీసుకు వెళ్లాలి’’ అని చెబితే చాలు. అప్పటికే ఫీడ్‌ చేసిన ఆఫీస్‌ అడ్రస్‌కు నేరుగా వెళ్లిపోతుంది. అంతేకాకుండా.. దారిలో ట్రాఫిక్‌ ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నింటిని మీకు వినిపిస్తుంది కూడా. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఈ కారు పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. టెస్లా కారు మాదిరిగా దీంట్లోనూ బ్యాటరీ ప్లాట్‌ఫార్మ్‌లో ఏర్పాటు చేస్తారు.  ఒకసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా మోటర్‌ షోలో ఈ సరికొత్త కారును ప్రదర్శిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh