ఉగ్రవాదిని చంపోద్దని ఓ పోలీసు అధికారి ఏం చేశాడంటే.. Saifullah was 'self-radicalised', say Police

Alleged is operative saifullah s father refuses to take his body

Lucknow encounter, 12 hour anti terror operation, Saifullah, ISIS, terror module, Sartaj, Anti national, Won't accept body, Khurasan module, CBI, Islamic State,

The cops called, Saifullah’s Kanpur-based brother Khalid, briefed him about the situation, who broke down and asked his brother to surrender, but he refused to surrender and said that he chose to die rather.

ఉగ్రవాదిని చంపోద్దని ఓ పోలీసు అధికారి ఏం చేశాడంటే..

Posted: 03/08/2017 08:05 PM IST
Alleged is operative saifullah s father refuses to take his body

లక్నోలో ఠాకూర్ గంజ్ లో మట్టుబెట్టిన ఉగ్రవాది సైఫుల్లా చంపకుండా.. అతడ్ని ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. సైఫుల్లా ఉంటున్న ఇంటిని గుర్తించిన ఏటీఎస్ సిబ్బంది, అతను ఇంట్లో ఉన్నాడని నిర్ధారించుకుని చుట్టుముట్టారు. దీనిని గుర్తించిన సైఫుల్లా కాల్పులు ప్రారంభించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతూ హెచ్చరికలు చేశారు. ఉజ్జయినీ రైలు ప్రమాదం నిందితుడిగా పేర్కొంటూ పలు సూచనలు చేస్తూ లొంగిపోవాలని హెచ్చరించారు. దీనికి అంగీకరించని సైఫుల్లా మళ్లీ కాల్పులు జరిపాడు.

దీంతో సైఫుల్లా సోదరుడికి ఫోన్ చేసిన ఏటీఎస్ అధికారులు విషయం వివరించి లొంగిపోవాల్సిందిగా సూచించాలని కోరారు. దీంతో అతని సోదరుడు లైన్ లో ఉన్నాడని, అతనితో మాట్లాడాలని సూచిస్తూ పోలీసులు తలుపు కిందనుంచి ఫోన్ ను లోపలికి తోశారు. దీంతో తన సోదరుడితో మాట్లాడని సైఫుల్లా తాను భద్రతా దళాలకు లొంగిపోయేది లేదని, బలవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో భద్రతా దళాలు ముందు భాష్పవాయు గోళాలు, తరువాత పెప్పర్ బాంబులు వేశారు. వాటికి ఎలాంటి వ్యక్తి అయినా బయటకు వస్తారు. కానీ సైఫుల్లా మాత్రం బయటకు రాలేదు.

దీంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఉగ్రవాది సైపుల్లాను తుదముట్టించారు. అనంతరం లోపలికి ప్రవేశించిన పోలీసులకు అతని గదిలో భారీ ఎత్తున ఆయుధాలు, ఐఎస్ఐఎస్ జెండాలు కపించాయి. దీంతో వారు ఆశ్చర్యపోయారు. కాగా, అతనిని సజీవంగా పట్టుకుని ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అసలు ప్లాన్ ఏంటి? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా ఎంత మంది పని చేస్తున్నారు? వంటి వివరాలు తెలుసుకోవాలని భావించారు. అందుకే చివరి వరకు అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

ఇదిలావుండగా, మరణించిన ఉగ్రవాది సైపుల్లా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అతని తండ్రి నిరాకరించాడు. దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని తాను తీసుకువెళ్లలేనని చెప్పాడు. పుట్టిన దేశానికి అన్యాయం చేయమని ఏ మతగ్రంధం చెప్పలేదు.. ప్రాణాలు తీయాలని, హింసను ప్రేరేపించినా ఏ దైవం సహించదని చెప్పుకోచ్చాడు. ఇక సైపుల్లా స్వతహాగా ఉగ్రవాదిగా మారాడని, అంతేకాని అతనికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles