పాత నల్లకుబేరుల వద్ద చిక్కిన కొత్త కరెన్సీ.. Rs 40,000 crore worth new notes blocked

Rs 40 000 crore worth new 2000 notes blocked

new rs 2000 note, demonetisation, RBI, urjit patel, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi, Rs 10,000 cr in circulation, Rs. 40,000 cr blocked, bank new rules, business, finance

The economists doubt that Rs 40,000 crore worth new notes blocked by black money holders, which lead to no cash boards near atm centers.

40 వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ అచూకీ ఏదీ..?

Posted: 03/08/2017 04:56 PM IST
Rs 40 000 crore worth new 2000 notes blocked

మళ్లీ దేశవ్యాప్తంగా ఏటీయం కేంద్రాలలో డబ్బుల కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గత నెల 23వ తేదీ నుంచి డబ్బుకు ఇబ్బందుల పాడాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి. ఏ ఏటీయం కేంద్రానికి వెళ్లిన నో క్యాస్ బోర్డులే అధికంగా దర్శనమిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నోట్లు లభించక.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బ్యాంకులు తాజాగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతోనూ అనేక అవస్థలకు ఖాతాదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం చిన్న విలువైన నోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి వస్తున్న తరుణంలో.. వాటిని ఎన్ని పర్యాయాలని ఏటీయంలకు వెళ్లి డబ్బులు తీసుకువాలి.. ఎంతమేర పెనాల్టి కట్ అవుతుందన్న విషయం కూడా తెలియక ప్రజలకు అనేక అవస్థలు పడుతున్నారు.

నాలుగు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్తనోట్లు కూడా కనుమరుగు కావడానికి కారణమేంటి..? అసలు కొ్త్త నోట్లు ఎక్కడికి వెళ్లాయి.. డబ్బుకు ఎందుకీ కటకట.. ఇప్పుడిదే చర్చ అయ్యింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నగదు కొరత ఏర్పడింది. అయితే దీనికి కారణాలను విశ్లేషించిన పిమ్మట తెలిపిందేమిటంటే.. దీనికంతటికీ కారణం.. డబ్బు బ్లాక్ కావటమేనని అర్థికవేత్తలు అంటున్నారు  పాత సీసాలో కొత్త మంది అన్నట్లు పాత నల్లకుభేరులు కొత్త కరెన్సీ నోట్లను తమ వద్ద అట్టిపెట్టుకుని బ్లాక్ చేయడం కారణంగానే డబ్బు చలామణిలో లేకుండా పోతుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

నోట్ల రద్దు తర్వాత RBI విడుదల చేసిన రెండు వేల నోటును వ్యాపారవేత్తలు బ్లాక్ చేయటమే ఇందుకు కారణం అంట. బ్యాంకుల నుంచి వెళ్లిన రూ.2వేల నోటు తిరిగి బ్యాంకులకు రాకపోవటంతో ప్రస్తుతం నగదుకు కటకట ఏర్పడింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 50వేల కోట్ల రూపాయల విలువైన రెండు వేల నోట్ల పంపిణీ జరిగింది. ఈ నాలుగు నెలల్లో బ్యాంకుల నుంచి బయటకు వెళ్లిన ఈ 50వేల కోట్లలో.. చెలామణిలో ఉన్నవి కేవలం 10వేల కోట్ల రూపాయలు మాత్రమే అంట. మిగతా 40వేల కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్లాక్ చేశారు. నోట్ల రద్దుతో వేల కోట్లను మార్చుకున్న బడాబాబులు.. వాటిని రెండు వేల నోటు రూపంలో భద్రంగా భద్రపరుచుకున్నారు.

కేవలం 500, 100 నోట్లను మాత్రమే అవసరాల కోసం తీస్తున్నారు. ఇటీవల బ్యాంకులు కూడా ఛార్జీల మోత తప్పదని చెప్పటంతో సామాన్య జనం సైతం.. డబ్బును దాచుకుంటున్నారు. అవసరాల కోసం కార్డులను ఉపయోగిస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో విత్ డ్రా తప్పితే.. డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోయాయి. బయటకు వెళ్లిన నోట్లు తిరిగి బ్యాంకులకు రాకపోవటంతో నగదు కొరత ఏర్పడిందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. విలువైన పెద్ద నోటు భద్రంగా బీరువాలు, లాకర్లలో మూలుగుతుంటే.. సామాన్యులు మాత్రం నగదు తిప్పలు తప్పటం లేదు. ఇక మరికోందరైతే మా డబ్బులపైన ప్రభుత్వం పెత్తనం ఏంటీ.. బ్యాంకుల అంక్షలేంటని, బడా వ్యాపారులను వదిలేసిన కేంద్రం కేవలం మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసి అంక్షలు విధించడం ఏంటని కూడా నిలదీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new rs 2000 note  demonetisation  RBI  urjit patel  Shaktikanta Das  finance ministry  arun jaitley  pm modi  

Other Articles

Today on Telugu Wishesh