ఏప్రిల్ ఫూల్స్ కాదు నిజంగానే బ్యాంకుల పేర్లు మార్పు Cabinet approves merger of 5 associate banks with SBI

Cabinet approves merger of 5 associate banks with sbi

SBI, SBI associates, SBI associates bank, State Bank of Bikaner and Jaipur, State Bank of Travancore, State Bank of Patiala, State Bank of Mysore, State Bank of Hyderabad, Bharatiya Mahila Bank, new associates bank in SBI

The Union Cabinet approved the merger of five associate banks -- State Bank of Bikaner and Jaipur, State Bank of Travancore, State Bank of Patiala, State Bank of Mysore and State Bank of Hyderabad as well as Bharatiya Mahila Bank with State Bank of India.

ఏప్రిల్ ఫూల్స్ కాదు... నిజంగానే బ్యాంకుల పేర్లు మార్పు

Posted: 02/24/2017 09:06 AM IST
Cabinet approves merger of 5 associate banks with sbi

స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనుబంధంగా నడుస్తున్న ఐదు బ్యాంకుల పేర్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మారుబోతేున్నాయి. అదేంటి ఏప్రిల్ పస్ట్ రోజున పేర్ల మార్పా..? అంటే ఇప్పటినుంచి ఏప్రిల్స్ 1న ఫూల్స్ డే రోజున ఫూల్ చేయడానికి రెడీ అవుతున్నారా ..? అనుకుంటే పోరబాటే. ఎందుకంటే ఇది ముమ్మాటికీ నిజం. స్టేట్ బ్యాంకు అప్ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి  అయిదు అసోసియేట్‌ బ్యాంకులు  మాతృ సంస్థ ఎస్‌బీఐలో పూర్తిగా విలీనం  కానున్నాయని ఎస్‌బీఐ  రెగ్యులేటరీ ఫైలింగ్‌ లోతెలిపింది. 2017 ఏప్రిల​ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ మారతాయని తెలిపింది.

గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత  డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్‌బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ  ముగిసిన తరువాత అసోసియేట్‌ బ్యాంకులు ఎస్‌బీబీజే, ఎస్‌బీఎం, ఎస్‌బీటీ షేర్లను స్టాక్‌మార్కెట్ల నుంచి తొలగించనున్నారు.

స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్  అసోసియేట్‌ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్  తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్‌  బోర్డ్‌ ఆఫ్‌ బ్యాంకు  ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్‌ రేషియో ఆధారంగా  ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే  భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్‌బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles