రన్నింగ్ రైలు కింద మహిళ సురక్షితం.. అదృష్టవంతురాలు Woman miraculously escapes death after coming under a running train

Woman miraculously escapes death after coming under a running train

woman under train video, shocking train video, train video, woman under train alive, youtube trending, trending videos, india viral videos, india train videos, train videos india, train runs over living girl

what happens when a speeding train hits somebody and the thought sends shivers down the spine. But a recent video showing a goods train in India running over a girl will leave you at your wit’s end!

ITEMVIDEOS: రన్నింగ్ రైలు కింద మహిళ.. శివుడాజ్ఞ లేదనుకుంటా..!

Posted: 02/24/2017 09:51 AM IST
Woman miraculously escapes death after coming under a running train

శివుడాజ్ఞ లేదనుకుంటా..? శివుడి అజ్ఞ లేకుండా చిన్న చీమైనా కుట్టదు. అలాంటి ఓ బాలిక నిండు ప్రాణం ఎలా పోతుంది.? అర్థం కాలేదా..? సకల చరాచర ప్రాణకోటిలో ఎవరు ప్రాణం ఎప్పుడు ఎలా తీయాలన్నది ఆయన అజ్ఞల మేరకే జరుగుతుందని. ఆయనే సృష్టి, స్థితి, లయకారుడన్నది హైందర ధర్మాన్ని పాటించే వారి విశ్వాసం. అందుకనే ఆ అమ్మాయిని అదృష్టవంతురాలని అంటున్నాం. అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు.

ట్రాకుపై నుంచి గూడ్స్ రైలు వెళ్తుంది. అంతా అయ్యో అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత అన్యాయం జరిగిపోయింది. కళ్ల ముందు ఎంత దారుణం జరిగిపోయింది అంటూ ప్రయాణికులందరకీ వార్త తెలిసి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా ఏంజరిగిందని తెలుసుకున్న ఓ వ్యక్తికి అక్కడున్న వారు సమాచారం అందించారు. ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఆ బాలికకు ఏం జరిగిందో అంటూ ఎదురుచూస్తున్నాం అన్నారు. కొందరు మాత్రం ఆ బాలిక  దిక్కుతోచని స్థితిలో వేగంగా ఆలోచించి ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయిందన్నారు. బాలికకు ఏం జరగకూడదనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.

ఈ హఠాత్పరిణామానికి స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు షాకయ్యారు.ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్‌ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles