కేరళ పోలీసుల తీరును నిలదీసిన యువజంట Couple Harassed By Police In Kerala

Irked by moral policing kerala couple goes live on facebook to ask cops to prove vulgarity

kerala, kerala police, moral police, kerala moral policing, cops moral policing, couple go live on fb against moral policing, facebook live against cops, viral video, viral news, kerala news, india news

Kerala cops from Museum Police Station in Thiruvananthapuram allegedly arrested a couple who were sitting together in a park in the area.

ITEMVIDEOS: కేరళ పోలీసుల తీరును నిలదీసిన యువజంట

Posted: 02/22/2017 11:38 AM IST
Irked by moral policing kerala couple goes live on facebook to ask cops to prove vulgarity

మోరల్ పోలిసింగ్ ఈ పదం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేరళలోని యువ జంటలు అందోళన చెందుతున్నాయి. ఇప్పటికే వాలెంటైన్స్ డే రోజున కొన్ని సంఘాలు, సంస్థలు యువజంటలు ఎక్కడ కనబడినా వారికి పెళ్లి చేస్తామంటూ ప్రకటనలు గుప్పించి.. ప్రేమ జంటలను కలుసుకోనీయకుండా చేస్తున్న తరుణంలో అదే పంథాను ఎందుకుని కేరళలోని యువజంటలు ఎక్కడ ఎప్పుడు కనిపించినా వారిని మోరల్ పోలిసింగ్ పేరుతో చిత్రవిచిత్రమై కేసులు పెట్టి వణుకుపుట్టిస్తున్నారు కేరళ పోలీసులు.

అయితే పోలీసులు తీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎవరైనా పూర్తిగా పోలీసుల వేధింపులను నిలువరించగలరా అంటూ కేరళలోని ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న తరుణంలో అలాంటి ప్రేమ జంట ఒక్కటి పోలీసుల తీరును నిలదీస్తూనే సాక్ష్యాన్ని కూడా పట్టేసుకుంది. పోలీసులు తమను అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ అదుపులోకి తీసుకునే తరుణంలో తాము అసభ్యకరంగా ఏం చేస్తున్నామన్నది చెప్పాలని ప్రేమ జంట నిలదీశారు.

వివరాల్లోకి వెళ్తే.. విచ్చు విష్ణు అనే యువకుడు తన ప్రియురాలితో కలసి పార్కులో కూర్చున్నాడు. వారేదో అంశాలను చర్చిస్తూ మరో లోకంలోకి వెళ్లారు. అయితే వారిని గమనించిన తిరువనంతపురానికి చెందని మ్యూజియం పోలిస్ స్టేషన్ పోలీసులు వారి వద్దకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎందుకు అని అడిగిన ప్రేమజంటకు మీరు పార్కులో మిట్టమధ్యాహ్న అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని మహిళా పోలీసుల కానిస్టేబుళ్ల సమాధనం వచ్చింది.

దీంతో చిరెత్తుకోచ్చన యువజంట.. ముఖ్యంగా విష్ణు తన ఫోన్ ను అన్ చేసి మోరల్ పోలిసింగ్ విధానాన్ని, తీరును ఎండగట్టేందుకు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. పోలీసులు వచ్చినప్పుడు తాను తన ప్రేయసి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నానే తప్ప.. ఏలాంటి అసభ్యతకు పాల్పడలేదని అయినా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నామని పోలీసులు అదుపులోకి తీసుకుంటామన్నడాన్ని తప్పుబట్టారు. అసభ్యకరంగా ఎలా ప్రవర్తించామన్నది పోలీసుల రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం తమను నోటికోచ్చినట్లు బూతులు తిట్టారని అరోపించారు. ఇక తన ప్రేయసిపై మహిళా కానిస్టేబ్లుళ్లు అసభ్యపదజాలంతో దూషించారని అరోపించాడు.

కాగా, పోలీసులు తమ చెంతకు వచ్చినప్పటి నుంచి వారి మాట్లాడుతున్న ప్రతీ మాటతో పాటు వారి కదలికలన్నింటినీ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ ద్వారా అందరితో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ లో లైవ్ ప్ట్రీమింగ్ అప్షన్ ను నొక్కి అక్కడ జరుగుతున్న ఘటననంతా ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇప్పుడది కాస్తా వైరల్ గా మారడంతో పోలీసుల మోరల్ పోలిసింగ్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. పోలీసుల మోరల్ పోలిసింగ్ తీరుతో విసుగు చెందిన అనేకులు ఈ యువకుడి మద్దతుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా యువ జంటను శభాష్ అంటూ కితాబిస్తూ ప్రశంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala police  moral police  kerala couple  facebook  viral video  

Other Articles