టీడీపీ నేత బరితెగింపు.. వాట్సాఫ్ గ్రూప్ లో పాడు వీడియో tdp leader posts Obscene video in whatsapp group

Tdp leader posts obscene video in whatsapp group

TDP, NTR Trust Bhavan, Whats aap, TDP MLC, tdp leader obscene video, nandyal tdp leader, kurnool district tdp leader whatsapp, whatsapp group

Ruling Telgudesam party leader from nandyal of kurnool district posts Obscene video in whatsapp group

టీడీపీ నేత బరితెగింపు.. వాట్సాఫ్ గ్రూప్ లో పాడు వీడియో

Posted: 02/22/2017 10:38 AM IST
Tdp leader posts obscene video in whatsapp group

గౌరవ ప్రదమైన హోదా లభించడానికి ఎంతగా కష్టపడతామో అందరికీ తెలిసిందే. సమాజంలో మనకు మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కడానికి పడిన కృషి, పట్టుదల అంతటితో అగిపోదు.. దానిని నిలబెట్టుకునేందుకు కూడా అంతకంటే అధికంగా శ్రమించాల్సి వుంటుంది. అయితే ఎంత హోదా వున్నా.. చిన్న తప్పులు చేస్తే అందంతా తుడిచిపెట్టుకుపోతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అధికార టీడీపీకి చెందిన నేత.

అపార రాజకీయ అనుభవం, ఐదు పదుల వయస్సు దాటిన ఈ నేత మధ్యం మత్తులో చేశారో లేక కావాలనే చేశారో తెలియదు కానీ.. చేయరాని పని చేసి అబాసుపాలయ్యాడు. అధికార పార్టీలో గుర్తింపు కలిగిన ఈ నేతకు వ్యాపార పరంగా, కౌన్సిల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ గుర్తింపు ఉంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈయన రెండు రోజుల క్రితం వాట్సాప్‌ గ్రూపులో అసభ్యకర విడియోను పోస్టు చేశారు.

తమ నేత నుంచి వాట్సాఫ్ లో మేసేజ్ రావడంతో.. అత్రుతగా కొందరు ఆ విడియో చూసి.. తమ నేత ఈ స్థాయికి దిగజారిపోయారా అని నివ్వెరపోయారు. ఇంతకీ ఆ వీడియో ఏంటటారా.. ఓ యువతి నగ్నంగా నృత్యం చేస్తున్న అశ్లీల వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ గ్రూపులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సహా మహిళా కౌన్సిలర్లు ఉండటంతో మంగళవారం వీరంతా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వాట్సాప్‌ నంబర్లకు, ఈ–మెయిల్స్‌కు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles