మీ మెయిల్ కు ఆ నోటీసులు వచ్చాయేమో చూసుకున్నారా..? No threat or show cause notices to taxpayers: CBDT tells officials

No threat show cause notices to taxpayers cbdt tells officials

Operation Clean Money., CBDT, I-T department, show cause notices, taxpayers, taxation, direct tax, black money, money laundering

As part of Operation Clean Money, the tax department had sent SMSes and emails to 18 lakh people who made suspicious deposits of over Rs 5 lakh during the 50-day deposit window post-demonetisation.

18 లక్షల మందికి నోటీసులు.. మీ ఖాతాలో నగదుపై వివరాలు చెప్పండీ..

Posted: 02/22/2017 12:40 PM IST
No threat show cause notices to taxpayers cbdt tells officials

ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా అధికారులు రెండవ దశ ఫేజ్‌ చర్యలకు దిగనునున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఐటీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనుమానాస్పద  ఖాతాల డిపాజిట్‌ దారులకు షోకాజ్ నోటీసులు జారీ  చేయాల్సిందిగా నిర్దేశించింది.  ఈ నేపథ్యంలో  ఆదాయపు పన్ను శాఖ వచ్చే నెల నుంచి 'ఆపరేషన్ క్లీన్ మనీ' రెండో దశ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. తొమ్మిది లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇటీవల ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అనుమానాస్పద ఖాతాదారులందరికీ ఆదాయపన్నుశాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. అనుమానాస్పద డిపాజిట్‌దారులపై  చట్టబద్దమైన నోటీసులు జారీల ద్వారా  వివరణ కోరనుంది. కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత  (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొన్న ఐటీ శాఖ ఆ వైపుగా కదులుతోంది. ఈ ఏడాది జనవరి, 31 2017 న 'ఆపరేషన్ క్లీన్ మనీ' పథాకాన్ని ఆదాయపు పన్ను శాఖ లాంచ్‌ చేసింది.  

ఈ ఆపరేషన్ కింద గతేడాది పాతనోట్ల రద్దు చేసిన మరుసటి రోజు తొమ్మిది నవంబర్ నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో సమయంలో చేసిన పెద్ద నోట్లు నగదు డిపాజిట్లపై ఐటీ కన్నేసింది. ముందుగా పద్దెనిమిది లక్షల ఖాతాలను అనుమానాస్పందగా తేల్చింది. మొదటి దశలో ఇ-ఫైలింగ్ పోర్టల ద్వారా ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ సందేశాలను పంపుతూ సమాధానాల నిమిత్తం ఇచ్చిన తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చారు. ఇ-నిర్ధారణ  అనంతరం వీరిలో 9 లక్షల ఖాతాలను  అనుమానాస్పదంగా తేల్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh