కమీషనర్ భార్య వాడగా లేనిది నేను వాడితే తప్పా.? circle inspector alleges siddipet police commissioner harassing him

Circle inspector alleges siddipet police commissioner harassing him

Chadharghat police, case against four students, Mesco Grade School, Old Malakpet, blackmail, class 8 student, unnatural sex, pictures, videos, Jamal Colony, Nalgonda Cross Roads, crime

husnabad ci, dasari bhumaiah, siddipet comissioner, shiva kumar, dgp, home guard, telangana movement, kcr, harish rao, police jeep, travera car

కమీషనర్ భార్య వాడగా లేనిది నేను వాడితే తప్పా.?

Posted: 01/30/2017 08:51 PM IST
Circle inspector alleges siddipet police commissioner harassing him

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ తనను వేధిస్తున్నారని హుస్నాబాద్‌ సీఐ దాసరి భూమయ్య ఘాటైన ఆరోపణలు చేశారు. తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘నేను 20 రోజులుగా సిక్‌ లీవ్‌లో ఉన్నాను. విధుల్లో చేరేందుకు వస్తుండగా ‘నీకు బదిలీ అయింది. నువ్వు స్టేషన్‌కు వెళ్లద్దు. జీపు వాడొద్దు’ అంటూ ఏసీపీతో కమిషనర్‌ ఒత్తిడి తీసుకువచ్చాడు. నాకు బదిలీ ఆర్డర్‌ రాలేదు. ప్రొసీజర్‌ ప్రకారం, కొత్తగా వచ్చే సీఐకి చార్జి అప్పగించిపోతాను అన్నప్పటికీ నిరాకరించారు. ఇక్కడ ఉండవద్దంటూ మానసిక ఒత్తిడికి గురి చేశారు’’ అని వివరించారు.

తనపై సీపీ కక్ష పెట్టుకోవడానికి కారణం తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటన అని తెలిపారు. ‘‘అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో జై తెలంగాణ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను యూనిఫాంలో లేని పోలీసులు కొట్టారు. దాంతో, పోలీస్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను అప్పటి డీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడు కరీంనగర్‌ ఎస్పీగా ఉన్న శివకుమార్‌ నాకు రెండు చార్జి మెమోలు ఇచ్చి సీఐడీకి బదిలీ చేయించారు.

అలాగే, అమరుల భవన నిర్మాణ అవకతవకలపై ఆర్‌టీఐ కింద లెక్కలు అడిగాను. దీనికి నాపై కక్ష పెంచుకున్నాడు’’ అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు చొరవతో తనకు మళ్లీ హుస్నాబాద్‌ సీఐగా బదిలీ అయిందని, విధుల్లో ఉండగానే ‘జీపు వాడొద్దు. కుర్చీలో కూర్చోవద్దు. స్టేషన్‌కు వెళ్లద్దు’ అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆంక్షలు విధించారని తెలిపారు. తన వద్దకు వచ్చి రిపోర్ట్‌ చేయాలని సీపీ ఆదేశించడమేమిటని ప్రశ్నించారు.

‘‘యూనిఫాం వేసుకున్న నన్ను జీపు వాడద్దని అంటున్నారు. సీపీ భార్య ప్రభుత్వానికి చెందిన టవెరాను ఉపయోగిస్తున్నారు. దానికి డ్రైవర్‌గా కోహెడ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ను వినియోగించుకున్నారు. ఇప్పుడు బెజ్జంకి కానిస్టేబుల్‌ టవేరా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రభుత్వ వాహనం వాడితే తప్పుకాదు. కానీ, నేను సీనియర్‌ పోలీస్‌ ఉద్యోగిగా డ్యూటీలో ఉండి వాహనం వాడుకోవడం తప్పా!?’’ అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles