ట్యాంకు శుభ్రం చేస్తూ 9 మంది మృతి.. ఏం జరిగిందసలు... | Workers die inhaling poisonous gas in Latur.

Nine workers die of suffocation in latur oil mill chemical tank

Latur Oil Mill, Latur Oil Mill Mishap, Chemical Death In India, Labour Deaths India, Chemical Tank Death, Maharashtra Oil Mill Deaths, Chemical Tank Deaths

Nine workers die of suffocation in Latur oil mill's chemical tank in Maharashtra.

ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఘోరం

Posted: 01/31/2017 08:57 AM IST
Nine workers die of suffocation in latur oil mill chemical tank

నిర్లక్ష్యం అమాయకపు ప్రజల ప్రాణాలను హరించివేస్తోంది. తాజాగా మ‌హారాష్ట్రలోని లాతూరులో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఆయిల్ మిల్లులోని కెమిక‌ల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. లోపలికి దిగిన వారు అపస్మారక స్థితికి చేరి అటు నుంచి అటే మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయారు.

ట్యాంకును శుభ్రం చేసేందుకు ఉప‌యోగించిన ద్ర‌వం.. ట్యాంకులోని ర‌సాయ‌నాల‌తో క‌ల‌వ‌డం వ‌ల్ల ఏర్ప‌డిన రియాక్ష‌న్ కార‌ణంగా విష‌వాయువులు వెలువ‌డి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు గంట‌లు గ‌డుస్తున్నా రాక‌పోవ‌డంతో మ‌రికొంద‌రిని అక్క‌డికి పంపించారు. వారు కూడా ఎంత‌కీ తిరిగి రాక‌పోవ‌డంతో కీడు శంకించిన మిల్లు యాజ‌మాన్యం అక్క‌డికి వెళ్లి చూడ‌గా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై చ‌ల‌నం లేకుండా పడి ఉన్న కార్మికుల‌ను గుర్తించారు.

వెంట‌నే వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే వారు మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విష‌వాయువులు పీల్చ‌డం వ‌ల్లే కార్మికులు మృతి చెంది ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Oil Mill  Lathur  Death  

Other Articles