బిసిసిఐ పగ్గాలను అందుకున్న ఆ నలుగురూ..! Supreme Court picks four administrators for BCCI

Supreme court appoints four member panel to take over bcci

bcci, bcci administrators, bcci list of administrators, bcci administrators list, bcci supreme court, supreme court cricket, cricket news, sports news

Supreme Court appointed a 4 member-panel of administrators to manage the affairs of the cricket board and report on whether it has complied with the Lodha Committee’s recommendations.

బిసిసిఐ పగ్గాలను అందుకున్న ఆ నలుగురూ..!

Posted: 01/30/2017 08:09 PM IST
Supreme court appoints four member panel to take over bcci

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని సోమవారం సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్‌ ఆర్‌ఎం లోధా ప్యానెల్‌ సూచించిన ప్రతిపాదనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మిగతా ముగ్గురిలో క్రికెట్‌ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ లిమాయే, భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ ఉన్నారు.

వీరిలో డయానాకు తప్ప క్రికెట్‌ ఆటతో ఎవరికీ సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రి బోర్డుకు చెందిన రోజువారీ కార్యకలాపాల ఇన్‌చార్జిగా ఉంటారని జడ్జిలు దీపక్‌ మిశ్రా, ఏఎమ్‌ ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ‘మార్పును చక్కగా కొనసాగించేందుకు బీసీసీఐలో నా పాత్ర నైట్‌ వాచ్‌మన్‌గా ఉంటుందని భావిస్తున్నాను. బోర్డు గురించి నాకు అవగాహన లేకపోయినా క్రికెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం’ అని వినోద్‌ రాయ్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles