బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు Controversial statement of BJP leader Suresh Rana

Kairana moradabad will be under curfew if i win says bjp mla

Uttar Pradesh Assembly polls, Suresh Rana, Thana Bhawan, exit of goons, up poll, assembly election, bharatiya janata party, Shamli district, Uttar Pradesh

BJP MLA makes controversial comments. On Sunday, Suresh Rana while addressing a meeting in Shamli's says if he wins, then the Muslim-dominated areas of Uttar Pradesh will witness curfew. "If I win, curfew will be imposed in Kairana, Deoband and Moradabad," he said. Video went viral.

ITEMVIDEOS: బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. గెలిస్తే కర్ఫ్యూ

Posted: 01/30/2017 12:44 PM IST
Kairana moradabad will be under curfew if i win says bjp mla

ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల ప్రకటనలు వివాదస్పదం అవుతున్నాయి. తాను కూడా ప్రధాని మోడీ లాగా ప్రజలను పిచ్చోళ్లను చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన సంచలన వ్యాఖ్యలను మర్చిపోకముందే.. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేశ్‌ రాణా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనను గెలిపిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తానని ఆయన బిజేపి కార్యకర్తలు సమావేశంలో ప్రకటించారు. ఇటీవల ఈ ప్రాంతంలో అల్లర్లు చెలరేగడం.. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కర్ప్యూ విధించిన విషయం తెలిపిందే. అయితే అల్లర్లును మరోమారు ఎన్నికల ప్రచారంలో సురేష్ రాణా ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది.


షామ్లి జిల్లా థానా భవాన్ ప్రాంతంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘మరోసారి నేను ఎన్నికల్లో గెలిస్తే కైరానా, దియోబంద్, మొరదాబాద్ లలో కర్ఫ్యూ విధిస్తాను. మార్చి 11న షామ్లి నుంచి థానా భవాన్ వరకు విజయయాత్ర నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉండండి. భారత్ మాతా కి జై’ అని వీడియోలో ఉంది. అల్లర్ల అంశాన్ని మళ్లీ లాగి ఎన్నికలలో లబ్దిపొందాలని బీజేపి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు పిర్యాదు చేశారు.

దీంతో తన వ్యాఖ్యలపై సురేష్ రాణా వివరణ ఇచ్చుకున్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని సురేశ్‌ రాణా చెప్పారు. తాను గెలిస్తే ఈ మూడు ప్రాంతాల నుంచి బలవంతపు వలసలకు కారణమవుతున్న రౌడీమూకలను అణచివేసేందుకు కర్ఫ్యూ విధిస్తానని అన్నట్టు వెల్లడించారు. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో అనేక ప్రాంతాలు, గ్రామాల్లో రౌడీ మూకల అలజడులకు భయకంపితులై ఇక్కడి ప్రజలు వలసలు వెళ్తున్నారని, రౌడీ మూకలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రజలకు అండగా వుండాలన్నదే తన అభిమతమని చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles