మసీదులో ప్రార్థనలు చేస్తున్నవారిపై ఉగ్రదాడి Canada: Shooting at mosque kills 4

6 killed 8 injured by gunmen who invaded quebec city mosque

canada, Québec, mosque shooting, gun attack, quebec city mosque, crime

Quebec police confirmed in a news briefing that six people had been killed and eight injured, in a mass shooting at a mosque in suburban Quebec City as worshipers were finishing their prayers.

ITEMVIDEOS: మసీదులో ప్రార్థనలు చేస్తున్నవారిపై ఉగ్రదాడి

Posted: 01/30/2017 11:37 AM IST
6 killed 8 injured by gunmen who invaded quebec city mosque

కెనడాలోని ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించారు. సాయుధులైన అగంతకులు మసీదులోకి చొరబడి అక్కడ ప్రార్థనలు ముగించుకుంటున్న ముస్లింలపై కాల్పులకు తెగబడ్డారు. విఛక్షణ కొల్పోయి ఉద్రవాదులు జరిపిన కాల్పుల్లో అరుగురు ముస్లిం సోదరులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఎనమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.  అందులో పలువురి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కెనడాలోని క్యుబెక్‌ నగరంలో ఉన్న ఓ మసీదులో సాయుధులు కాల్పులకు తెగబడిన వార్త తీవ్ర కలకలం రేపాయి.

సుమారు ముగ్గురు సాయుధ దుండగులు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో మసీదు ఉన్న భవనంలో దాదాపు 40 మంది ఉన్నారు. ఫాయ్‌ స్ట్రీట్‌లో ఉన్న క్యుబెక్‌ సిటీ ఇస్లామిక్ కల్చరల్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలర్ట్‌ అయిన కెనడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులకు తెగబడిన ఇద్దరు సాయుధులను తాము అధుపులోకి తీసుకున్నామని క్యుబెక్ నగర అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనను ఉగ్రదాడిగా పేర్కోన్నారు.

నిందితులుగా అనుమానిస్తున్న వారిలో ఒకరిని ఘటనాస్థలానికి 14 మైళ్ల దూరంలోని సెయింట్ లార్సెన్స్ నది తీరంలో నిందితుడు ఓర్లిన్స్ ద్విపానికి పారిపోతుండగా తమ బలగాలు పట్టుకుని అరెస్టు చేశాయన్నారు. కాగా రెండో నిందితుడ్ని మాత్రం మసీదుకు చేరులోనే అదుపులోకి తీసుకన్నట్లు అమె తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో వున్నాయని ఘటనాస్థలంతో పాటు సరిసరాలు కూడా పూర్తిగా తమ బలగాలు అధీనంలోకి తీసుకున్నాయని, మసీదు ప్రాంతంలో ఎవరూ లేకుండా మొత్తాన్ని ఖాళీ చేయించామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : canada  Québec  mosque shooting  gun attack  quebec city mosque  crime  

Other Articles