ప్రజాస్వామ్య ప్ర్రకియ దెబ్బతినేలా అర్బీఐ చర్యలా..? Must follow our order: EC to RBI on raising cash limit

Rbi ec at loggerheads over cash withdrawal limit for poll candidates

election commission, reserve bank of india, rbi, money withdrawal, ec rbi, elections, weekly withdrawal limit, withdrawal limit, demonetisation, up polls, uttarakhand polls, goa polls, punjab polls, manipur polls, poll campaign, latest news

EC had asked the central bank to relax the weekly bank withdrawal limit from Rs 24,000 to Rs 2 lakh for candidates contesting elections in Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa and Manipur.

ప్రజాస్వామ్య ప్ర్రకియ దెబ్బతినేలా అర్బీఐ చర్యలా..?

Posted: 01/30/2017 01:27 PM IST
Rbi ec at loggerheads over cash withdrawal limit for poll candidates

ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా భారతీయ సెంట్రల్ బ్యాంకు రిజర్వు బ్యాంకు చర్యలు వున్నాయని.. కేంద్ర ఎన్నికల కమీషన్ అర్బీఐపై మొట్టికాయలేసింది. నగదు విత్ డ్రాపై ఉన్న పరిమితిని పెంచాలన్న తమ వినితిని భారతీయ రిజర్వు బ్యాంకు తిరస్కరించడంపై ఎలక్షన్ కమీషన్ అగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ అదేశాలను అర్బీఐ తప్పక పాటించాలని అదేశించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు విత్ డ్రా పరిమితిని పెంచాలని కొరుతూ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు మరో లేఖను రాసింది.

ఈ మేరకు విన్నవిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ రాసిన తొలి లేఖపై స్పందించిన భారతీయ రిజర్వు బ్యాంకు.. ఈసీ కొరిన్నట్లు తాము విత్ డ్రా పరిమితిని పెంచలేమని స్పష్టం చేసింది. ఈ చర్య సరైంది కాదనీ, అంగీకరించలేమని ఈసీ తెలిపింది. దానికి బదులుగా ఈసీ రాసిన రెండో లేఖలో కనీసం చట్టబద్ధమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులకు నగదు విత్‌ డ్రాలపై నిరోధం ఉండకూడదని సూచించింది. నగదు ఉపసంహరణకు అనుమతి నివ్వాలని మరోసారి కోరింది.  

ప్రస్తుతం వారానికి ఉన్న రూ. 24 వేల పరిమితిని రూ. 2లక్షలకు పెంచాల్సిందేనని  తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయా అభ్యర్థులకు రూ. 28 లక్షల దాకా ఖర్చుచేసే హక్కు వుందని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్‌బీఐ  తొందరపడిందని తన లేఖలో పేర్కొంది. ఎన్నికల సందర్భంగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అనేక బిల్లులు ఉన్నాయని.. అభ్యర్థులు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన ఈసీ ఆర్‌బీఐని ఈ మేరకు అర్బీఐకి లేఖరాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles