ఒక్కరోజు ముందు.. హలో మోదీజీ.. అంటూ అధ్యక్షుడి ఫోన్ Obama expresses gratitude towards PM Modi for strengthening Indo-U.S. ties

Obama expresses gratitude towards pm modi for strengthening indo u s ties

Barack Obama, Narendra Modi, modi, Obama expresses gratitude towards PM Modi for strengthening Indo-U.S. ties, President Obama, India, PM modi, Indo-US ties, news, India news, latest news

Outgoing U.S. President Barack Obama in a telephonic conversation with PM Narendra Modi thanked him for his support and contribution to the Indo-U.S. ties.

ఒక్కరోజు ముందు.. హలో మోదీజీ.. అంటూ అధ్యక్షుడి ఫోన్

Posted: 01/19/2017 12:34 PM IST
Obama expresses gratitude towards pm modi for strengthening indo u s ties

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరొక్క రోజులో దిగిపోతున్న బారక్ ఒబామా.. భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా రెండు పర్యాయాలు శ్వేతసౌధం నుంచి పాలనను సాధించిన ఒబామా.. గత రెండున్నరేళ్లుగా భారత్ తో అమెరికా అనుబంధాన్ని మరింత దృడంగా పెంపోందించారు. ఈ నేపథ్యంలో తన పదవీకాలం పూర్తయిపోతోందనగా మోదీకి ఫోన్ చేశారు. భారత్ - అమెరికా దేశాల మధ్య గల వ్యాపార, వాణిజ్య, శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు పలు రంగాలలో సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
ప్రధానంగా రక్షణ రంగం, పౌర-అణు ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు తదితర విషయాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆర్థిక వ్యవస్థ, రక్షణరంగ ప్రాధాన్యాలు, భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ రంగ భాగస్వామిగా గుర్తించడం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. దీంతో అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్రమోడీ మధ్య ఇప్పటి వరకు ఎనిమిది పర్యాయాలు సమావేశాలు జరిగాయి. వీరిద్దరి మధ్య చాలా దృఢమైన బంధం ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇద్దరికీ పరస్పరం గౌరవం ఉందని, ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటారని ఆమె చెప్పారు.

ఇక ఆ తరువాత అధ్యక్ష హోదాలో చిట్టచివరి మీడియా సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు వుంటాయన్నారు. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులుగా హిందువులు, లాటినోలు, యూదుుల కూడా ఎన్నికయ్యే అవకాశాలు వున్నాయని అన్నారు. ప్రతీ జాతికి, మతానికి సముచిత స్థానం వుంటుందన్నారు. దేశంలోని ఏ మూలన వున్నా.. ప్రతిభావంతులను  పసిగట్టి.. ప్రోత్సహించడమే అమెరికా బలమని అయన చెప్పుకోచ్చారు. దేశానికి ఒక నల్లజాతీయుడు అధ్యక్షుడిగా ఎన్నికకాగా, ఇలాంటిది మరోమారు జరిగే అవకాశముందా..? అన్న ప్రశ్నకు బదులుగా ఈ సమాధానమిచ్చారు.

అమెరికాలో చాలామంది తమకు గుర్తింపు లేదని భావించారని, వాళ్లే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఓటేశారని చెప్పారు. తమను చిన్నచూపు చూస్తున్నారని వాళ్లు అనుకున్నారని, తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో రావోనని భయపడ్డారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళ్తారు. తాజాగా మీడియా మీద కూడా ట్రంప్ విరుచుకుపడిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఒబామా ప్రస్తావించారు. మీడియా ఉండటం వల్లే తాము నిజాయితీగా ఉండగలుగుతూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామని ఒబామా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Narendra Modi  President Obama  India  PM modi  Indo-US ties  

Other Articles